విభిన్న లొకేషన్లలో డ్యాన్స్ చేస్తూ.. ఆ వీడియోలతో సోషల్ మీడియాలో (Socila Media) హల్‌చల్ చేస్తుంటారు కొందరు వ్యక్తులు. ఇలాంటి ప్రయత్నం చేసిన ఒక బెంగాలీ నటుడికి షాక్ ఇచ్చారు కోల్‌కతా పోలీసులు (Kolkata Police). కమెడియన్, సోషల్ వర్కర్ అయిన శాండీ సాహాకు (Sandy Saha) కోల్‌కతా పోలీసులు తాజాగా జరిమానా విధించారు. ఆయన చేసిన ఒక డ్యాన్స్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో కోల్‌కతాలో భారీ ట్రాఫిక్ ఉండే మా ఫ్లై ఓవర్‌పై శాండీ సాహా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. సెప్టెంబర్ 13న శాండీ ఈ వీడియోను తన అధికారిక ఫేస్ బుక్ (Facebook) పేజీలో షేర్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు.
శాండీ మా ఫ్లైఓవర్‌పై(Ma flyover) కారు ఆపడం, అందులోంచి శాండీ దిగి రోడ్డుకు అటు వైపు వెళ్లి డ్యాన్స్ చేస్తూ “మై ఆయీ హు యూపీ, బిహార్ లూట్నే” అనే ప్రముఖ బాలీవుడ్ పాట పాడటం, అంతా రికార్డు అయింది. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో కంటెంట్‌పరంగా శాండీ చాలా పాపులర్ వ్యక్తి. అంతే కాదు ఇది కోల్‌కతా కాదు, ఇది యూపీ అని బెంగాలీలో అతను అనడం కూడా ఈ వీడియోలో వినిపించింది. రోడ్డు మీద వాహనాలు వస్తున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా శాండీ సాహా ఈ 3.38 నిమిషాల వీడియోలో డ్యాన్స్(Dance) చేయడం రికార్డు అయింది.
PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన మోదీ.. అందుకోసమే ఈ పర్యటన అని ట్వీట్..
ఇలాంటి పనులు చేసేందుకు మా ఫ్లై ఓవర్ సురక్షితం కాదని, సోషల్ మీడియా యూజర్లు చాలా మంది ఈ విషయాన్ని కోల్‌కతా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. శాండీ సాహాపై చర్యలు తీసుకోవాలని వీడియో కామెంట్ సెక్షన్‌లో చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ శాండీ సాహా మాత్రం తాను ఏ ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) ఉల్లంఘించలేదని ప్రకటించారు. అయితే ఆ ఫ్లైఓవర్‌పై కారు నిలపడం నిషేధమనే విషయం తనకు తెలియదని ఒప్పుకున్నారు.
Viral video: బాలుడి తలపై గిన్నె పెట్టి హెయిర్ కటింగ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!
ఈ తరహా ఘటన మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ వ్యాపార నగరం ఇండోర్‌లోనూ చోటుచేసుకుంది. శ్రేయ కాల్రా అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్ ట్రాఫిక్ సిగ్నల్ ముందు డ్యాన్స్ చేశారు. ఈ వ్యవహారం అక్కడ తీవ్ర కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఆ మహిళ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఆమె చర్యను తప్పుబట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెకు నోటీసు జారీ చేశారు.
మరో వైపు కోల్‌కతాలో చోటుచేసుకున్న ఘటనను తెలియజేస్తూ అక్కడి తిల్‌జాలా ట్రాఫిక్ గార్డుకు నోటీసు అందింది. అంతే కాదు ఆ సమయంలో శాండీతో పాటు ఆయనతో ఉన్నవారందరికీ కూడా జరిమానా నోటీసులు పంపించారు. అంతే తిల్‌జాలా పోలీసులు ఈ సంఘటనపై సొంతంగా కేసు నమోదు చేసి అక్రమంగా పార్క్ చేసినందుకు డ్రైవరుకు నోటీసు పంపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kolkata, Viral Video