12వ తరగతికే డిప్యూటీ పోలీస్ కమిషనర్ అయిన బాలిక.. కోల్‌కతాలో సంచలనం

12వ తరగతిలో రిచా సింగ్ 99.25 శాతం మార్కులు తెచ్చుకుంది. జీడీ బిర్లా సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్‌లో చదివిన రిచా.. ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది.

news18-telugu
Updated: May 9, 2019, 3:22 PM IST
12వ తరగతికే డిప్యూటీ పోలీస్ కమిషనర్ అయిన బాలిక.. కోల్‌కతాలో సంచలనం
కోల్‌కతా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా బాలిక (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
ఆ బాలిక పేరు రిచా సింగ్.. చదివింది 12 వ తరగతి.. కానీ, ఇప్పుడు కోల్‌కతాకే డిప్యూటీ కమిషనర్ అయ్యింది. అదేంటీ.. ఇంటర్ చదువుతోనే ఆ పోస్ట్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అయ్యో! నిజం. ఆ బాలిక 12వ తరగతికే పోలీస్ ఉన్నతాధికారి అయ్యింది. పైగా, ఆమె తండ్రికి బాస్ అయ్యి ఆయన్ను ఆదేశించేందుకు రెడీ అయ్యింది. అసలు విషయంలోకి వెళితే.. ఈ మధ్య వెలువడిన 12వ తరగతిలో రిచా సింగ్ 99.25 శాతం మార్కులు తెచ్చుకుంది. జీడీ బిర్లా సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్‌లో చదివిన రిచా.. ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించిన పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అభినందించారు. అంతేకాదు.. ఒక రోజు పోలీస్ ఉన్నత పదవి కట్టబెట్టి ఘనంగా సత్కరించారు. ఒక రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోల్‌కతా డిప్యూటీ కమిషనర్‌గా రిచా కొనసాగుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆమె ఘనతను ప్రశంసిస్తూ అరుదైన అవకాశం కల్పించామని తెలిపారు. అన్నట్లుగానే ఈ రోజు పదవిలో కూర్చోబెట్టారు.

కాగా, రిచా తండ్రి రాజేశ్ సింగ్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్‌లో అడిషనల్ ఇన్‌ఛార్జి. దీనిపై రిచాను పోలీస్ ఉన్నతాధికారులు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. నువ్వు పోలీసువు కదా.. నీ తండ్రిని ఏమని ఆదేశిస్తావని ప్రశ్నించగా ఇంటికి త్వరగా వెళ్లు అని చెబుతానని అన్నది. దీనిపై రాజేశ్‌ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘తను ఇప్పుడు నా బాస్. ఆమె ఆదేశాలను శిరసావహిస్తా’ అని సంతోషంతో చెప్పుకొచ్చారు.

First published: May 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...