Home /News /trending /

KOLKATA BAHUBALI THALI EATER WILL WIN RS 30000 IN WEST BENGAL HERE ARE THE DETAILS PRN GH

Bahubali Thali: ఈ థాలీ ధర రూ.1500.. 30 నిమిషాల్లో వడ్డించినవన్నీ తింటే రూ.30 వేలు మీవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kolkata: దాదాపు 30 రకాల ఆహార పదార్థాలతో వడ్డించే బాహుబలి థాలీని (Bahubali Thali) అందిస్తోంది కోల్‌కతాకు చెందిన ఒక రెస్టారెంట్.

మీరు కొత్తరకం ఆహార పదార్థాలను బాగా ఇష్టపడతారా? వివిధ రకాల వంటకాలపై ఆసక్తి చూపుతారా? అయితే మీకోసం ఒక శుభవార్త. దాదాపు 30 రకాల ఆహార పదార్థాలతో వడ్డించే బాహుబలి థాలీని అందిస్తోంది కోల్‌కతాకు చెందిన ఒక రెస్టారెంట్. అంతేకాదు.. ఈ అతి పెద్ద థాలీని 30 నిమిషాల్లో తినేస్తే.. 30వేల రూపాయల నగదు బహుమతి కూడా పొందవచ్చు. ఇంతకు ముందు క్యాష్ ప్రైజ్‌ రూ.15,000 ఉండగా.. ప్రస్తుతం దీన్ని రూ.30,000కు పెంచారు. కానీ దీన్ని ఆర్డర్ చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిందే. బయట రూ.100-200 పెడితే థాలీ వస్తుంది. కానీ ఈ బాహుబలి థాలీ ధర మాత్రం రూ.1500 కావడం విశేషం. కోల్‌కతాలోని న్యూ నార్మల్ కేఫ్ అండ్ కిచెన్ అనే రెస్టారెంట్ దీన్ని ఆవిష్కరించింది.

కోల్‌కతాలో లభ్యం కాని ఆహార పదార్థాలు ఉండవు. ఈ నగరం డై హార్డ్ ఫుడ్ లవర్స్‌కు, వాటి తయారీదారులకు కూడా కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ నిర్వహించే సాధారణ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏదో ఒక ప్రత్యేకత లేకుంటే వ్యాపారం సరిగ్గా నడవదు. అందుకే కోల్‌కతాలోని బిధాన్ నగర్ సెక్టార్‌-1లో ఉన్న న్యూ నార్మల్ కేఫ్ అండ్ కిచెన్ రెస్టారెంట్ కొత్తగా ఆలోచించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు బాహుబలి థాలీని ఆవిష్కరించింది. దీంట్లో నోరూరించే 30 రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ఇది పశ్చిమ బెంగాల్‌లో మొట్టమొదటి పెద్దసైజు థాలీ అని నిర్వాహకులు చెబుతున్నారు. దీంట్లో డెజర్ట్‌లు, డ్రింక్స్‌తో పాటు ఇండియన్, చైనీస్, మొఘల్ వంటకాలు కూడా ఉన్నాయి.





* అన్నీ తింటే నగదు బహుమతి
థాలీ ఛాలెంజ్‌కు సంబంధించిన వివరాలను రెస్టారెంట్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. మార్చి 1న పరోటా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పలావ్, స్టీమ్ రైస్, గ్రీన్ సలాడ్, అప్పడం.. వంటి పదార్థాలు ఉన్న బాహుబలి థాలీని నిర్వాహకులు ఆవిష్కరించారు. కూరల్లో దాల్ మఖానీ, యెల్లో దాల్ ఫ్రై, చికెన్ కాషా, చిల్లీ చికెన్, ఫిష్ కాలియా, మంచూరియన్, మిక్స్‌డ్ వెజ్, ఎగ్ కర్రీ, చిల్లీ పొటాటో.. వంటివి ఉంటాయి. దీంతో పాటు రోజ్ లస్సీ, రూహ్ ఆఫ్జా, మజ్జిగ, తాజా నిమ్మ సోడా వంటి డ్రింక్స్ కూడా అందిస్తారు. పెసరపప్పు హల్వా, ఐస్‌క్రీమ్, రైతాలను డెజర్ట్స్‌గా ఇస్తారు.

* పెరుగుతున్న కస్టమర్ల సంఖ్య
బెంగాల్‌లో తక్కువ ధరల్లో అందించే అతిపెద్ద బాహుబలి థాలీ తమదేనని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. థాలీ ఛాలెంజ్ ప్రకారం.. 30 నిమిషాల్లో ఈ పదార్థాలన్నీ పూర్తిగా తిన్నవారికి రూ.30,000 నగదు బహుమతి ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఈ రెస్టారెంట్‌కు వచ్చి థాలీని ఆస్వాదిస్తున్నవారి ఫోటోలను సైతం ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. కానీ ఛాలెంజ్‌లో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది డబ్బు గెలుచుకున్నారనే వివరాలను మాత్రం రెస్టారెంట్ ఇప్పటివరకూ ప్రకటించలేదు.
First published:

Tags: Kolkata, West Bengal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు