‘దేశం విడిచి వెళ్లిపో...’ నెటిజన్ ట్వీట్‌కు విరాట్ కోహ్లీ స్ట్రాంగ్ రిప్లై...

‘విరాట్ కోహ్లీ ఓవర్ రేటెడ్ బ్యాట్స్‌మెన్. అతని బ్యాటింగ్‌లో ప్రత్యేకత ఏమీ లేదు... భారత బ్యాట్స్‌మెన్ ఆటకంటే ఇంగ్లీష్, ఆసీస్ ప్లేయర్ల బ్యాటింగ్ బాగుంటుంది...’ అంటూ ట్వీట్ చేసిన నెటిజన్... అదిరిపోయే షాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 7, 2018, 5:44 PM IST
‘దేశం విడిచి వెళ్లిపో...’ నెటిజన్ ట్వీట్‌కు విరాట్ కోహ్లీ స్ట్రాంగ్ రిప్లై...
విరాట్ కోహ్లీ
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 7, 2018, 5:44 PM IST
పరుగుల సునామీ సృష్టిస్తూ చెలరేగిపోతున్న భారత సారథి విరాట్ కోహ్లీ ఆటతీరుకి మాజీ క్రికెటర్ల నుంచి జూనియర్ల అందరూ ఫిదా అయిపోతున్నారు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ సచిన్ సృష్టించిన అనితర సాధ్యమైన రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్నాడీ రన్ మెషిన్. అయితే ఎంతటి వారికైనా యాంటీ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదురవ్వడం సహాజమే. విరాట్ కోహ్లీకి అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే విరాట్ కోహ్లీకి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడో నెటిజన్... దానికి భారత సారథి కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.

తాజాగా 30వ ఒడిలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ... తన పుట్టినరోజున పంపిన శుభాకాంక్షల ట్వీట్లను చదువుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో ఓ నెటిజన్... ‘విరాట్ కోహ్లీ ఓవర్ రేటెడ్ బ్యాట్స్‌మెన్. నాకు అతని బ్యాటింగ్‌లో పెద్దగా ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. నీలాంటి భారత క్రికెటర్ల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్ బ్యాట్స్‌మెన్లు ఆడే ఆటే నాకెంతో బాగా నచ్చుతుంది...’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి విరాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వీడియో ట్వీట్ చేశాడు... ‘నా ఆటతీరు నచ్చకపోతే అది నీ పర్సనల్ విషయం. దాని గురించి నేనేమీ మాట్లాడను. కానీ భారత దేశంలో ఉంటూ వేరే దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావ్. నా దేశాన్ని ఇష్టపడని నీకు ఇక్కడుంటే అర్హత లేదు. దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపోతే బాగుంటుంది... ’ అంటూ గట్టిగా సమాధానం చెబుతూ వీడియో పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ.

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...
Loading...
అయితే విరాట్ రియాక్షన్‌పై కామెంట్లు వినిపిస్తున్నాయి. భారత క్రికెటర్లను ఇష్టపడనంత మాత్రాన దేశం వదిలేయాలా? అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి కూడా టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ అంటే ఇష్టం కదా... మరి ఆయనెందుకు ఇక్కడున్నారంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. దీంతో విరాట్ కోహ్లీకి మరోసారి విమర్శల వర్షం మొదలైంది.
First published: November 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...