KBC Play Along: స్మార్ట్‌ఫోన్ ఉందా? కౌన్ బనేగా కరోడ్‌పతీ మీరూ ఆడొచ్చు ఇలా

KBC Play Along | కేబీసీ ప్లే ఎలాంగ్‌ కాంపిటీషన్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో SonyLIV యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

news18-telugu
Updated: August 21, 2019, 4:50 PM IST
KBC Play Along: స్మార్ట్‌ఫోన్ ఉందా? కౌన్ బనేగా కరోడ్‌పతీ మీరూ ఆడొచ్చు ఇలా
KBC Play Along: స్మార్ట్‌ఫోన్ ఉందా? కౌన్ బనేగా కరోడ్‌పతీ మీరూ ఆడొచ్చు ఇలా (image: Sony LIV)
news18-telugu
Updated: August 21, 2019, 4:50 PM IST
కౌన్ బనేగా కరోడ్‌పతి... ఇండియాలో బాగా క్రేజ్ సంపాదించుకున్న గేమ్ షో. హిందీలో పాపులర్ అయిన కేబీసీని ఇతర భాషల్లోనూ నిర్వహిస్తుండటం విశేషం. ఇక హిందీలో 10 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న కేబీసీ 11వ సీజన్ ఆగస్ట్ 19న ప్రారంభమైంది. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొనాలన్న లక్ష్యం చాలామందికి ఉంటుంది. ఆ హాట్ సీట్‌లో కూర్చొని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి డబ్బుతో పాటు పేరు సంపాదించాలన్న కోరిక లక్షలాది మందికి ఉంటుంది. కానీ అవకాశం లభించేది కొందరికి మాత్రమే. అయితే కేబీసీ షోలో హాట్ సీట్‌లో కూర్చున్నవాళ్లు మాత్రమే కాదు... ఈ షో చూస్తున్నవాళ్లు కూడా కేబీసీ ఆడే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. హర్ సీట్ హాట్ సీట్ పేరుతో ఈ అవకాశం ఇస్తున్నారు. 'కేబీసీ ప్లే ఎలాంగ్' పేరుతో కాంపిటీషన్ జరుగుతోంది. ఇందులో పార్టిసిపేట్ చేసి సరైన సమాధానాలు చెబితే హాట్ సీట్‌కు చేరుకునే లక్కీ ఛాన్స్ కూడా రావొచ్చు.

KBC Play Along: కేబీసీ ప్లే ఎలాంగ్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి?


కౌన్ బనేగా కరోడ్‌పతి 11వ సీజన్ సోనీ టీవీలో ప్రసారం అవుతోంది. SonyLIV యాప్‌లో కూడా ఈ కార్యక్రమం చూడొచ్చు. ఇదే యాప్‌లో 'కేబీసీ ప్లే ఎలాంగ్' కాంపిటీషన్ జరుగుతోంది. షో జరుగుతున్న సమయంలో హాట్‌ సీట్‌లో ఉన్న కంటెస్టెంట్‌కు వేసే ప్రశ్నలే స్మార్ట్‌ఫోన్‌లోనూ కనిపిస్తాయి. వాటికి మీరూ మీ స్మార్ట్‌ఫోన్‌లో సమాధానాలు ఇచ్చి పాయింట్స్ పెంచుకోవచ్చు. కంటెస్టెంట్‌కు ఉన్నట్టుగానే మీకూ లైఫ్ లైన్స్ ఉంటాయి. అయితే అక్కడ కంటెస్టెంట్‌లు డబ్బు గెలుచుకుంటే మీరు పాయింట్స్ గెలుచుకుంటారు. మీరు ఏ ప్రాంతం నుంచి గేమ్ ఆడుతున్నారో వెల్లడించాలి. మీరు వెల్లడించిన సిటీలో మీ పాయింట్స్ ప్రకారం మీ ర్యాంకింగ్ ఎంతో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. సరైన సమాధనాలు చెబితే పాయింట్స్ పెరుగుతుంటాయి. విజేతలకు ప్రతీ ఎపిసోడ్ చివర్లో బహుమతుల్ని ప్రకటిస్తుంది కేబీసీ.



KBC Play Along: కేబీసీ ప్లే ఎలాంగ్‌కు రిజిస్టర్ ఎలా చేసుకోవాలి?


కేబీసీ ప్లే ఎలాంగ్‌ కాంపిటీషన్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో SonyLIV యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. కేబీసీ ప్లే ఎలాంగ్‌ రిజిస్ట్రేషన్ పేజీ కనిపిస్తుంది. అందులో మీ పేరు, జెండర్, రాష్ట్రం, నగరం, ఇమెయిల్ ఐడీ, వృత్తి లాంటి వివరాలను వెల్లడించాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసినవాళ్లు కేబీసీ షో జరుగుతున్న సమయంలో గేమ్ ఆడొచ్చు. షోలో అమితాబ్ బచ్చన్ ప్రశ్న వేయగానే అదే ప్రశ్న మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీ జవాబు సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. మీ జవాబు సరైనదో కాదో వెంటనే తెలిసిపోతుంది. లీడర్ బోర్డ్‌పై మీ ర్యాంకింగ్ చూడొచ్చు. అయితే కేబీసీ ప్లే ఎలాంగ్‌ కాంటెస్ట్‌కు రిజిస్టర్ చేసుకునే ముందు నియమనిబంధనలన్నీ చదవాలి.
Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Parle G: పార్లే-జీకి తగ్గిన డిమాండ్... 10,000 మంది ఉద్యోగాలకు గండం

Aadhaar Link: ఫేస్‌బుక్, వాట్సప్ అకౌంట్లతో ఆధార్ లింక్ చేయాలా?

IRCTC: తిరుమల వెళ్లాలా? ఐఆర్‌సీటీసీ నుంచి ప్రతీ రోజూ టూర్ ప్యాకేజీ
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...