PAN Card: 48 గంటల్లో పాన్ కార్డ్... పొందండి ఇలా

PAN Card | పాన్ కార్డు మీకు పోస్ట్‌లో రావాలంటే 15 నుంచి 20 రోజులు పడుతుంది. కానీ మీరు వెంటనే కావాలన్నా పాన్ కార్డ్ పొందొచ్చు.

news18-telugu
Updated: May 16, 2019, 11:19 AM IST
PAN Card: 48 గంటల్లో పాన్ కార్డ్... పొందండి ఇలా
PAN Card: 48 గంటల్లో పాన్ కార్డ్... పొందండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 16, 2019, 11:19 AM IST
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేసే పాన్ కార్డ్... ఆర్థిక వ్యవహారాలు జరిపేవారందరికీ కావాల్సిన డాక్యుమెంట్. వ్యక్తులకే కాదు కంపెనీలకూ పాన్ కార్డులు జారీ చేస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. పాన్ కార్డ్ ఉంటేనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యం. గతంలో పాన్ కార్డు తీసుకునే ప్రాసెస్ చాలా సుదీర్ఘంగా ఉండేది. దరఖాస్తు చేసి రెండుమూడు వారాలు ఎదురుచూస్తే తప్ప పాన్ కార్డ్ వచ్చేది కాదు. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత పాన్ కార్డు పొందడం సులువైపోయింది. ఆన్‌లైన్‌లో కొన్ని సులువైన స్టెప్స్‌తో పాన్ కార్డ్ ఈజీగా పొందొచ్చు. అయితే పాన్ కార్డు మీకు పోస్ట్‌లో రావాలంటే 15 నుంచి 20 రోజులు పడుతుంది. కానీ మీరు వెంటనే కావాలన్నా పాన్ కార్డ్ పొందొచ్చు.

Read this: PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...

బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్‌, పాస్‌పోర్ట్ దరఖాస్తు కోసం మీకు వెంటనే పాన్ కార్డు కావాలంటే కేవలం 48 గంటల్లో పొందొచ్చు. అంటే ఇది తత్కాల్ పాన్ అప్లికేషన్ లాంటింది. ఫామ్ 49ఏ లేదా ఫామ్ 49ఏఏ దరఖాస్తు ద్వారా మీరు వెంటనే పాన్ కార్డు పొందొచ్చు. ఎన్ఎస్‌డీఎల్ అధికారిక వెబ్‌సైట్ www.tin-nsdl.com లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లేదా పాన్ కేంద్రం నుంచి పాన్ దరఖాస్తు ఫామ్ తీసుకోవచ్చు. ఈ దరఖాస్తును ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను బ్లాక్ ఇంక్‌తో ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్‌తో పూర్తి చేయాలి. వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో రెండు కలర్ ఫోటోలు అతికించాలి. డేట్ ఆఫ్ బర్త్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ జత చేయాలి. బర్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆదార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్, రేషన్ కార్డు లాంటివి జత చేయొచ్చు. మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వివరాలు రాయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే డిజిటల్ సిగ్నేచర్ తప్పనిసరి.

Read this: Gym Business: జిమ్‌ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన... ఎలాగో తెలుసుకోండి



తప్పులు లేకుండా పాన్ కార్డ్ దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేస్తే మీకు ఫిజికల్ కార్డ్ వచ్చే లోపు ఇ-పాన్ జారీ అవుతుంది. మీ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ద్వారా మీ పాన్ కార్డ్ దరఖాస్తును ట్రాక్ చేయొచ్చు. రెండు రోజుల్లోనే మీకు ఇ-పాన్ జారీ అవుతుంది. అత్యవసరమైతే ఇ-పాన్ ఉపయోగించుకోవచ్చు. ఫిజికల్ కార్డ్ 15 నుంచి 20 రోజుల్లో వస్తుంది.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్

Loading...
ఇవి కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? ఈ టిప్స్ మీకోసమే...

Aadhaar: ఆధార్ కార్డు వాడట్లేదా? డీయాక్టివేట్ అయిపోతుంది

SSY Scheme: రోజుకు రూ.100 పొదుపుతో రూ.16 లక్షల రిటర్న్స్...
First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...