తిరుమల టూర్ ప్లాన్ చేస్తున్నారా? శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారా? నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమల క్షేత్రానికి ప్లానింగ్‌తో వెళ్తే దర్శనానికి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడొచ్చు. శ్రీవారి దర్శనం టికెట్లను మీరు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. చాలామందికి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ గురించి తెలియక తిరుమలకు వెళ్లాక ఇబ్బందులు పడుతుంటారు. మీరు తిరుమల టూర్ ముందే ప్లాన్ చేసుకుంటున్నట్టైతే రూ.300 దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో సులువుగా బుక్ చేసుకోవచ్చు. 'స్పెషల్ ఎంట్రీ దర్శనం' టికెట్లు ఇవి. 12 ఏళ్ల లోపు పిల్లలు ఈ టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరు గరిష్టంగా 6 టికెట్లు తీసుకోవచ్చు. దర్శనానికి 60 రోజుల ముందు టికెట్లు తీసుకోవచ్చు. ఒకసారి టికెట్లు బుక్ చేసిన తర్వాత క్యాన్సలేషన్, రీఫండ్ కుదరదు. మీరు 'స్పెషల్ ఎంట్రీ దర్శనం' టికెట్లు బుక్ చేయాలనుకుంటే మీ దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ ఉండాలి. ముందుగానే https://ttdsevaonline.com వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు బుక్ చేసేప్పుడు మీ డిజిటల్ ఫోటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు ఎంత మంది పేర్ల మీద టికెట్లు బుక్ చేయాలనుకుంటున్నారో వారి పూర్తి పేర్లు, ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్స్ దగ్గరుండాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు.
ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ వెబ్‌సైట్ tirumala.org ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో 'online booking' బటన్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో 'Special Entry Darshan' బటన్ పైన క్లిక్ చేయండి.
దర్శనానికి వెళ్లాల్సిన రోజు, టైమ్ స్లాట్ సెలెక్ట్ చేయాలి.
లడ్డూలు ఎన్ని కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకరికి రెండు లడ్డూలు ఇస్తారు.
ఆ తర్వాత ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
ఒకసారి వివరాలు సరిచూసుకొని కంటిన్యూ క్లిక్ చేయాలి.
తర్వాతి పేజీలో భక్తుల వివరాలు పూర్తిగా ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి.
పేమెంట్ పూర్తైన తర్వాత టికెట్స్ డౌన్‌లోడ్ చేయాలి.
Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
SBI Card: మీ దగ్గర ఎస్‌బీఐ కార్డు ఉందా? ఇన్స్యూరెన్స్ ఫ్రీ
SBI Alerts: ఎస్‌బీఐ ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తున్నాయా? రాకపోతే ఇలా రిజిస్టర్ చేసుకోండి
IRCTC: మీ రైలు టికెట్ మరొకరి పేరు మీదకు మార్చాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.