• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • KNOW HOW TO BOOK INDANE GAS CYLINDER BOOKING THROUGH SMS FOLLOW THESE STEPS SS

Indane Gas: ఇండేన్ గ్యాస్ బుక్ చేయడానికి SMS పంపండి ఇలా

Indane Gas: ఇండేన్ గ్యాస్ బుక్ చేయడానికి SMS పంపండి ఇలా

Indane Gas: ఇండేన్ గ్యాస్ బుక్ చేయడానికి SMS పంపండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Indane Gas Cylinder Booking SMS | గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి మీ ఫోన్‌లో బ్యాలెన్స్ లేదా? ఇంటర్నెట్ కూడా లేదా? ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్ బుక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    మీరు ఇండేన్ గ్యాస్ కస్టమరా? ప్రతీ నెల ఇండేన్ గ్యాస్ బుక్ చేస్తుంటారా? గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి అనేక పద్ధతులున్నాయి. మీరు ఓ ఎస్ఎంఎస్ పంపి గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ సర్వీస్ అందిస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ కావాలంటే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత క్షణాల్లో సిలిండర్ బుక్ చేయడం సాధ్యమవుతోంది. ఫోన్ కాల్, వాట్సప్ మెసేజ్, పేటీఎం, ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్ సులువుగా బుక్ చేయొచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్ బుక్ చేయాలంటే ముందుగా మీ కాంటాక్ట్ నెంబర్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ గ్యాస్ ఏజెన్సీ నెంబర్‌కు ఓ ఎస్ఎంఎస్ పంపాలి. మరి ఎస్ఎంఎస్ ఏ ఫార్మాట్‌లో పంపాలో, ఏ నెంబర్‌కు పంపాలో, గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

    IRCTC Tour: భక్తులకు గమనిక... నవగ్రహ ఆలయాల టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

    SBI Credit Card: గుడ్ న్యూస్... ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు తీసుకునేవారికి రూ.6500 బెనిఫిట్స్

    Indane Gas Booking SMS: ఎస్ఎంఎస్ ద్వారా ఇండేన్ గ్యాస్ బుక్ చేయండి ఇలా


    మీరు ఎస్ఎంఎస్ సదుపాయం ఉపయోగించాలంటే ముందుగా రిజిస్టర్ చేయాలి. ఇందుకోసం IOC అని టైప్ చేసి STD Code తో పాటు డిస్ట్రిబ్యూటర్ కాంటాక్ట్ నెంబర్, కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ లైన్ నెంబర్ 23110572, ఎస్‌టీడీ కోడ్ 040. కన్స్యూమర్ నెంబర్ 12345678 అనుకుందాం. అప్పుడు IOC 04023110572 12345678 అని టైప్ చేసి స్థానిక ఐవీఆర్ఎస్ నెంబర్‌కు మెసేజ్ పంపాల్సి ఉంటుంది. గతంలో ఐవీఆర్ఎస్ నెంబర్లు వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరుగా ఉండేవి. కానీ నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే ఐవీఆర్ఎస్ నెంబర్ 7718955555 ప్రారంభించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఆ తర్వాత నుంచి IOC అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఐవీఆర్ఎస్ నెంబర్‌‌కు మెసేజ్ చేస్తే చాలు. సిలిండర్ బుక్ అవుతుంది.

    Indian Railways: డిసెంబర్ 1 నుంచి రైళ్లు నడవవా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

    Cylinder Booking on Paytm: పేటీఎంలో సింపుల్‌గా సిలిండర్ బుకింగ్... ఎలా చేయాలంటే

    ఒకవేళ మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నట్టైతే వాట్సప్‌లో ఓ మెసేజ్ పంపించడం ద్వారా ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. 7588888824 నెంబర్‌కు వాట్సప్ చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్‌లో 7588888824 నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత ఇదే నెంబర్ సెర్చ్ చేసి ఛాట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Refill అని టైప్ చేసి మెసేజ్ పంపిస్తే చాలు సిలిండర్ బుక్ అవుతుంది. ఈ నెంబర్ 24 గంటలు పనిచేస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు