Home /News /trending /

KNOW ABOUT THIS RAILWAY STATION IN INDIA WHICH STILL HAVE NO NAMES SINCE 2008 AK

Trending: దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌కు ఇప్పటికీ పేరు లేదు.. 2008 నుంచి ఇదే పరిస్థితి.. ఎందుకంటే..

పేరు లేని రైల్వేస్టేషన్

పేరు లేని రైల్వేస్టేషన్

Railway Station No Name: ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడ బుర్ద్వాన్‌లో పేరులేని స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో రైనా అనే గ్రామంలో నిర్మించబడింది.

    ప్రపంచంలో ప్రతిదానికీ ఒక గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపు ఎక్కువగా పేరు ద్వారానే వస్తుంది. వ్యక్తి అయినా లేదా ప్రాంతమైనా కచ్చితంగా ఒక పేరు ఉంటుంది. ఎవరైనా ఒక ప్రదేశానికి వెళితే, దాని గురించి కూడా పేరు ద్వారానే చెబుతారు. భారతదేశంలోని ప్రతి చిన్న ప్రదేశానికి ఒక పేరు ఉంటుంది. అది గ్రామమైనా, పట్టణమైనా. ఎవరైనా ఎక్కడికైనా వెళితే అదే పేరుతో వేరే వాళ్లకు ఆ స్థలం గురించిన సమాచారం ఇచ్చేవాడు. రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు అనేక ఇతర గమ్యస్థానాలను దాటుతారు. రైల్వే స్టేషన్ (Railway Station)  పేరును బట్టి, వారు ఆ స్థలం గురించి ఇతరులకు చెబుతారు.

    భారతదేశంలోని ఏ స్టేషన్ నుండి వెళ్లినా, దానికి ఒక పేరు ఉంటుంది. అయితే భారతదేశంలో పేరు లేని రైల్వేస్టేషన్ ఉందని చాలామందికి తెలియదు. పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) పేరులేని రైల్వే స్టేషన్ ఉంది.. ప్రపంచంలో రైల్వే నెట్‌వర్క్ పరంగా నాలుగో స్థానంలో ఉన్న భారత్‌లో పేరు లేని స్టేషన్ ఉంది.

    ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడ బుర్ద్వాన్‌లో పేరులేని స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో రైనా అనే గ్రామంలో నిర్మించబడింది. దీనిని 2008లో నిర్మించారు. అప్పటి నుండి దీనికి పేరు లేదు. 2008కి ముందు ఈ స్టేషన్‌ని రైనానగర్‌గా పిలిచేవారు.

    Permanent smile: చిన్నారికి అరుదైన మెడికల్ కండిషన్‌.. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది.. ఎందుకిలా జరుగుతుంది?

    Car in River: కావేరి నది కాలువలో BMW కారు.. యజమాని ఎందుకు అలా చేశాడంటే..

    ఈ స్టేషన్‌కు ఇప్పటివరకు పేరు లేకపోవడానికి కారణం రెండు గ్రామాల మధ్య విభేదాలే. రైనా, రైనానగర్ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ స్టేషన్ రైనా గ్రామ భూమిలో ఉంది. కానీ దానికి రైనానగర్ అని పేరు పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అనంతరం రైల్వే స్టేషన్‌లో ఉన్న నేమ్‌ బోర్డును తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టేషన్‌కు పేరు లేదు. అయినప్పటికీ ఈ స్టేషన్ టిక్కెట్ రైనానగర్ పేరు మీద ఇస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: India Railways, Trending news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు