• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • KNOW ABOUT NOVEMBER 2019 BANK HOLIDAYS LIST AND PLAN YOUR BANKING TRANSACTIONS SS

November Holidays: బ్యాంకు పనులు ఉన్నాయా? నవంబర్‌లో సెలవుల వివరాలివే

November Holidays: బ్యాంకు పనులు ఉన్నాయా? నవంబర్‌లో సెలవుల వివరాలివే

November Holidays: బ్యాంకు పనులు ఉన్నాయా? నవంబర్‌లో సెలవుల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

November 2019 Bank holidays list | ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మీ బ్యాంకు పనుల్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. మరి నవంబర్‌లో ఏఏ తేదీల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
    బ్యాంక్ పనులు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా? బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరాలు ఏవైనా ఉన్నాయా? ఆర్థిక లావాదేవీలు, ఇతర ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకులకు వెళ్లేవాళ్లు ముందుగా బ్యాంకు వేళలు, సెలవుల వివరాలు తెలుసుకుంటే మంచిది. లేకపోతే తీరా బ్యాంకు వరకు వెళ్లాక పని పూర్తి కాకుండానే తిరిగి రావాల్సి వస్తుంది. ఒకవేళ మీకు నవంబర్‌లో బ్యాంకు పనులు ఏవైనా ఉంటే ఆ నెలలో 7 రోజులు సెలవులు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోండి. సాధారణంగా ప్రతీ నెలలో రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. ఇక ఆ నెలలో వచ్చే నాలుగు లేదా ఐదు ఆదివారాలు కూడా సెలవులే. నవంబర్‌లో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో పాటు మరో సెలవు కూడా ఉంది. కాబట్టి నవంబర్‌లో మొత్తం 7 రోజులు బ్యాంకులకు సెలవు. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మీ బ్యాంకు పనుల్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. మరి నవంబర్‌లో ఏఏ తేదీల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

    2019 November Holidays List: నవంబర్‌లో సెలవుల వివరాలివే...


    నవంబర్ 3- ఆదివారం
    నవంబర్ 9- రెండో శనివారం
    నవంబర్ 10- ఆదివారం
    నవంబర్ 12- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి
    ననంబర్ 17- ఆదివారం
    నవంబర్ 23- నాలుగో శనివారం
    నవంబర్ 24- ఆదివారం

    రాష్ట్రాల వారీగా బ్యాంకులకు సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌‌సైట్‌లో చూడొచ్చు. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    WhatsApp: వాట్సప్ గ్రూప్స్‌ మీకు సమస్యగా మారాయా? ఈ ఫీచర్ ట్రై చేయండి

    LIC: మీ ఎల్ఐసీ పాలసీకి బోనస్ వచ్చిందా? ఎస్ఎంఎస్‌తో తెలుసుకోవచ్చు

    Tirumala Darshanam Tickets: తిరుమలలో 'స్పెషల్ ఎంట్రీ దర్శనం' టికెట్లు బుక్ చేయండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు