Bank Holidays: ఆగస్ట్‌లో బ్యాంక్ సెలవుల వివరాలివే... మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోండి

Bank Holidays in August 2019 | ఆగస్ట్‌లో రెండు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. నాలుగు ఆదివారాలున్నాయి. వీటితో పాటు రెండో, నాలుగో శనివారం కూడా బ్యాంకులు బంద్.

news18-telugu
Updated: August 3, 2019, 7:24 AM IST
Bank Holidays: ఆగస్ట్‌లో బ్యాంక్ సెలవుల వివరాలివే... మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బ్యాంకింగ్... ప్రతీ ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో బ్యాంకు సేవలు వినియోగించుకోవాల్సిందే. ఈమధ్య కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ పెరిగిపోవడంతో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకపోయినా... ఇప్పటికీ కొన్ని పనుల కోసం బ్యాంకు మెట్లు ఎక్కక తప్పట్లేదు. అందుకే బ్యాంకులో లావాదేవీలు ఏవైనా జరపాలనుకుంటే ముందుగానే బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవడం అవసరం. సాధారణంగా నిబంధనల ప్రకారం రెండో, నాలుగో శనివారంతో పాటు ఆదివారాలు బ్యాంకులకు సెలవు. ఇవి కాకుండా పబ్లిక్ హాలిడేస్ వస్తుంటాయి. ఆగస్ట్‌లో రెండు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. నాలుగు ఆదివారాలున్నాయి. వీటితో పాటు రెండో, నాలుగో శనివారం కూడా బ్యాంకులు బంద్. అంటే... ఆగస్ట్‌లో 8 రోజుల పాటు బ్యాంకులకు తాళం పడే అవకాశముంది. ఆగస్ట్‌లో బ్యాంకులకు ఏఏ తేదీల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

ఆగస్ట్‌లో బ్యాంకులకు సెలవులు ఉండే తేదీలు ఇవే...



ఆగస్ట్ 4- ఆదివారం
ఆగస్ట్ 10- రెండో శనివారం
ఆగస్ట్ 11- ఆదివారం
ఆగస్ట్ 12- బక్రీద్
ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే, రాఖీ పౌర్ణమిఆగస్ట్ 18- ఆదివారం
ఆగస్ట్ 24- నాలుగో శనివారం
ఆగస్ట్ 25- ఆదివారం

ఆగస్ట్ 10 నుంచి ఆగస్ట్ 12 వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో శనివారం, ఆదివారం, బక్రీద్ వరుసగా రావడంతో లాంగ్ వీకెండ్ రానుంది. కాబట్టి ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఏవైనా ఉంటే ఈ సెలవుల్ని గుర్తుంచుకొని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

New Rules: బండి నడుపుతున్నారా? కొత్త రూల్స్ తెలుసుకోండి

AP Jobs: గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 జాబ్స్... జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇవే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో 79 ట్రైనీ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 3, 2019, 7:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading