హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral news: రైతుల పొలాల్లోకి కింగ్ కోబ్రా.. ఎంత పెద్దదంటే..

Viral news: రైతుల పొలాల్లోకి కింగ్ కోబ్రా.. ఎంత పెద్దదంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడులో ఈ కింగ్​ కోబ్రా సంచరిస్తోంది. ప్రత్తిపాడు మండలం చింతలూరులో పాము సంచరించడంతో అక్కడి రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. 12 అడుగుల పొడవనున్న ఈ కోబ్రా సరుగుడు తోటల్లో రైతులకు కనిపించింది. అది మనుషులను చూస్తూ.. ఆగి ఆగి వెళుతుంటే రైతుల గుండెలు అదిరిపోయాయి.

ఇంకా చదవండి ...

  పెద్దపెద్ద పాములను కేవలం సినిమాలోనే చూసి ఉంటాం.. లేదా ఏదైనా అడవిలో.. అదే పెద్ద పాము జనావాసాల్లోకి వస్తే .. కటకటా.. అవును ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 అడుగుల పొడవైన పాము. కింగ్​ కోబ్రా.. యానిమేషన్​ సినిమాల్లో మాత్రమే చూసే పెద్ద పాము ఒక్కసారిగా తమ ముందు కనిపించడంతో.. అక్కడి రైతుల గుండెలు జారిపోయాయి.. భయంతో వణికిపోయారు.. ఏం చేయాలో తెలియక పరుగు లంకించుకున్నారు..

  వెంటనే వెళ్లి ఊళ్లో వాళ్లకి చెప్పారు.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చుట్టు పక్కల ఊళ్లకు పాకింది.. దీంతో అంత పెద్ద పాము తమ ఊళ్లకు వస్తే ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కు మంటూ జీవితం గడుపుతున్నారు. అక్కడిరైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందంటే నమ్మండి. చాలామంది అసలు నిద్రే పోవడం లేదట. దీంతో ఎలాగైనా ఆ కోబ్రాను పట్టి తమ గ్రామ ప్రజలకు భయం నుంచి విముక్తి కలిగించాలని పలువురు నడుం బిగించారు. ఇంతకు ఆ కోబ్రా ఎక్కడుంది.. ఎవరు చూశారు.. వివరాలు తెలుసుకుందా..

  పాము వీడియోను తీశారు..

  తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడులో ఈ కింగ్​ కోబ్రా సంచరిస్తోంది. ప్రత్తిపాడు మండలం చింతలూరు సరుగుడు తోట్లలో పాము సంచరించడంతో అక్కడి రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. 12 అడుగుల పొడవనున్న ఈ కోబ్రా సరుగుడు తోటల్లో రైతులకు కనిపించింది. అది మనుషులను చూస్తూ.. ఆగి ఆగి వెళుతుంటే రైతుల గుండెలు అదిరిపోయాయి. చింతలూరు గ్రామానికి చెందిన బొడ్డు లోవరాజు, సూరిబాబుల పొలాల్లో అది అధికంగా సంచరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. కాగా, ఆ పాము వీడియోను సైతం రైతులు రికార్డు చేశారు. అటవీశాఖ అధికారులకు చూపించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు కోబ్రాను పట్టకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని రైతులు వేడుకుంటున్నారు. లేకుంటే అది తమని కాటేస్తే అక్కడికక్కడే ప్రాణాలు పోతాయని బోరుమంటున్నారు.

  గతంలో విశాఖ పట్నంలో ఇలాంటి కోబ్రానే సంచరించింది. కానీ అది పది అడుగుల కింగ్​ కోబ్రా. విశాఖలోని మాడుగులలో నూకాలమ్మ దేవాలయ పరిసర ప్రాంతంలో కోబ్రా కనిపించింది. ఆసమయంలో అక్కడ అమ్మవారి జాతర సైతం జరుగుతుండటం గమనార్హం. భక్తులు భయాందోళనకు గురవడంతో వన్యప్రాణి సంరక్షణ అధికారులు వచ్చి కోబ్రాను పట్టుకున్నారు. సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. కానీ, ఈ కోబ్రా మరింత పెద్దగా ఉండటంతో ప్రత్తిపాడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలాలకు ఎలా పోయేదని రైతన్నలు వాపోతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Andhra Pradesh, Farmers, Snake

  ఉత్తమ కథలు