సన్నబడిన నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్... అనారోగ్యం కావచ్చని ప్రజల్లో అనుమానాలు

సన్నబడిన నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (File image - credit - reuters)

Kim Jong Un: ఉత్తర కొరియాలో ప్రతీదీ చిత్రంగానే ఉంటుంది. అక్కడి నుంచి ఏ వార్త వచ్చినా.. దానికి క్లారిటీ ఉండదు. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ సన్నబడిన వార్త కూడా ఎన్నో అనుమానాలు కలిగిస్తోంది.

 • Share this:
  Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత, నియంత కిమ్ జోంగ్ ఉన్... దాదాపు 2 వారాల తర్వాత టీవీలో కనిపించాడు. ఎప్పుడూ బొద్దుగా, కొబ్బరి బోండాంలా నిండుగా కనిపించే ఆయన... సన్నగా, స్మార్ట్‌ లుక్‌తో ఉండేసరికి స్టేట్ టీవీలో ఆయన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వారి కళ్లలోంచీ నీళ్లు తన్నుకొచ్చాయి. అవి ఆనందభాష్పాలో, ఆందోళనో అర్థం కాని పరిస్థితి. చాలా మంది గుండె పగిలినట్లు ఏడ్చారని స్టేట్ టీవీ తెలిపింది. కొంత మంది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆవేదన ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. తమ దేశంలో ఒక్క కరోనా కేసూ లేదన్న కిమ్ జోంగ్ ఉన్... తన ఫిట్‌నెస్‌పై ఏనాడూ ఫోకస్ పెట్టలేదు. అందువల్ల ఆయన సడెన్‌గా అంతలా సన్నబడటమేంటని ప్రజలకు మతిపోతోంది.

  "మా కామ్రేడ్ జనరల్‌ను ఇలా చూస్తుంటే... గుండె తరుక్కుపోతోంది" అని కొంతమంది చెప్పినట్లు రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లోని ఓ పౌరుడు... కొరియా సెంట్రల్ టీవీకి శుక్రవారం తెలిపాడు. "వారి కళ్ల నుంచి కన్నీళ్లు వాటంతట అవే వచ్చినట్లు వారు నాకు చెప్పారు" అని ఆ యువకుడు తెలిపాడు. తన పేరు చెప్పడానికి అతను ఇష్టపడలేదు.

  ఈమధ్య కిమ్ జోంగ్ ఉన్, ఆయన పార్టీ పాలనను మెచ్చుకుంటూ... కొన్ని పాటలతో కూడిన మ్యూజికల్ కాన్సర్ట్ ఒకటి జరిగింది. దానిపై ప్రజలు ఎలా ఫీల్ అయ్యారో తెలుసుకునేందుకు ఆ టీవీ 20 మందితో 8 నిమిషాలపాటూ... ఓ ఇంటర్వ్యూ లాంటిది పెట్టింది. ఆ టీవీలో ఏది వచ్చినా ప్రభుత్వానికి వంద శాతం అనుకూలంగా వస్తుంది. అందులో అభిప్రాయం చెప్పే ప్రజలు కూడా అలాంటి వారినే ఎంపిక చేస్తుంది. ముందుగానే వారికి అన్నీ చెప్పి... అప్పుడు మాత్రమే లైవ్ ఇస్తుంది. దాంతో అ టీవీలో వచ్చే ప్రసారాలన్నీ కిమ్‌ని ఆకాశానికి ఎత్తేసేలా ఉంటాయి.

  జూన్ 4 తర్వాత కిమ్ తాజాగా కనిపించాడు. చాలా సన్నగా ఉన్నాడు. కానీ అనారోగ్యంతో ఉన్నట్లు కనిపించలేదు. విదేశీ ఏజెన్సీలు కొన్ని కిమ్ బరువును ట్రాక్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన బరువు ఎందుకు తగ్గాడు, ఎంత తగ్గాడు, ఎలా తగ్గాడు, ఇప్పుడు ఎంత బరువు ఉన్నాడు అనే అంశాలపై ఫోకస్ పెట్టాయి. కిమ్ ఫ్యామిలీలో ముందు తరాల వారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చాయి. అందువల్ల కిమ్ ఆరోగ్యం ఎలా ఉంది అనేదాన్ని పరిశీలిస్తున్నారు.

  ఇది కూడా చదవండి: Viral video: టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్తున్నారా.. ఈ వైరల్ వీడియో చూశాక.. నిర్ణయం తీసుకోండి

  10 రోజుల కిందట... పార్టీలోని కీలక నేతలు, అధికారులతో కిమ్ సమావేశం ప్రారంభమైంది. దేశంలో ఆకలి, ఆహార కొరతపై చర్చిస్తున్నాడు. అమెరికాతో చర్చలకు సిద్ధం అని ప్రకటించాడు. 37 ఏడేళ్ల కిమ్ అధికబరువుతో ఉండేవాడు. చైన్ స్మోకర్ కుడా. 2014లో 6 వారాలపాటూ ప్రజలకు కనిపించలేదు. ఆ తర్వాత జూన్‌లో మరోసారి 2 వారాలపాటూ కనిపించలేదు. ఇప్పుడు ఆయన సన్నబడటం కూడా ఓ సంచనల వార్త అయిపోయింది. దానికి ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు మిస్టరీగానే మిగిలాయి.
  Published by:Krishna Kumar N
  First published: