హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Kim Jong Unకు ఏమైంది? అలా మారాడే? North Koreaలో ఆహార సంక్షోభం.. తొలిసారి అణుబాంబు లేకుండా..

Kim Jong Unకు ఏమైంది? అలా మారాడే? North Koreaలో ఆహార సంక్షోభం.. తొలిసారి అణుబాంబు లేకుండా..

మాట్లాడితే మిస్సైల్ టెస్టులు తప్ప మరో ఆదేశాలివ్వని కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు.. బక్కచిక్కిపోతూ, అరగుండును వదిలేశారు. తన పదేళ్ల పాలనలో తొలిసారి ఆటం బాంబుల ప్రస్తావన లేకుండా దాదాపు తొలిసారి ఆహార సంక్షోభంపై మాట్లాడారు. ప్రజలంతా వ్యవసాయ ఉత్పత్తిని పెంచి, దేశ ఆహార సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరారు..

ఇంకా చదవండి ...

  ఆటం బాంబులతో బంతాట ఆడుకుంటాడు.. సిగరెట్లు కాల్చినంత తేలికగా క్షిపణుల్ని పేల్చుతుంటాడు.. అగ్రరాజ్యం అమెరికా పేరు వింటేనే కస్సున బుస కొడతాడు.. ఇవీ.. నార్త్ కొరియా నియంత నేత కిమ్ జోంగ్ ఉన్ గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే ఉపమానాలు. కిమ్ మార్కు రాజకీయాల గురించి తెలియకున్నా ఆయన భారీ కాయం, గుండ్రటి ముఖం, అరగుండు హెయిల్ స్టైల్‌ను గుర్తుపట్టే జనం ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు. అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండవన్నట్లు, కిమ్ సారు ఇప్పుడు బక్కచిక్కిపోతున్నారు.. అరగుండును వదిలేసి తల నిండా వెంట్రుకలు పెంచుతున్నారు.. తన పదేళ్ల పాలనలో తొలిసారి ఆటం బాంబుల ప్రస్తావన లేకుండా ఆహార సంక్షోభంపై మాట్లాడారు.. ఏ విధంగా చూసినా నార్త కొరియా ప్రజలతోపాటు యావత్ భూగోళానికి మొన్నటి కిమ్ ‘ఇయర్ ఎండ్ సందేశం’ చాలా కొత్తగా అనిపించింది..

  అమెరికా పేరెత్తకుండా..

  ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తన ‘కొరియన్ వర్కర్స్ పార్టీ’ ఐదురోజుల ముఖ్య సమావేశం ముగింపు సందర్భంగా దేశ ప్రజలకు ఇయర్ ఎండ్ సందేశమిచ్చారు. సాధారణంగా ఆయన వార్షికాంత ప్రసంగంలో శత్రువులైన అమెరికా, దక్షిణ కొరియాకు హెచ్చరికలతోపాటు అణుబాంబుల ప్రస్తావన, క్షిపణి ప్రయోగాల రోడ్ మ్యాప్ వివరణ కచ్చితంగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం కిమ్ ప్రసంగం పూర్తిగా ఆహార సంక్షోభం, దేశీ అభివృద్ది అంశాలపైనే సాగింది. రక్షణ రంగంలో మెరుగ్గా ఉన్నామన్న ఆయన.. ‘విదేశీ శక్తులను నిలువరిస్తాం’ అనే వాక్యం తప్ప తన ప్రసంగంలో ఎక్కడా అమెరికా పేరును, అణుబాంబుల ఊసును ప్రస్తావించలేదు. కిమ్ తీరులో చోటుచేసుకున్న ఈ మార్పుల కంటే ఆయన ఆహార్యంలో కనిపించిన తేడాలు చర్చనీయాంశాలయ్యాయి.

  నార్త్‌లో ఆహార సంక్షోభం..

  మామూలుగానే ప్రపంచంతో పనిలేనట్లుండే ఉత్తరకొరియా.. కరోనా వైరస్ ప్రబలిన ఈ రెండేళ్లలో లోకానికి ఇంకా దూరమైపోయింది. స్వదేశంలో వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి కిమ్ తీసుకున్న కఠినాతికఠిన నిర్ణయాల ఫలితాలు బెడిసికొట్టాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఉత్తరకొరియాలో పంటల ఉత్పత్తి క్రమంగా క్షీణించి, ఇప్పుడు దేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆహార నిల్వలు పడిపోవడంతో రేషన్ సరుకుల్లో భారీగా కోతలు పెడుతున్నారు. దీంతో జనానికి సరిపడా తిండి లభించడం కష్టంగా మారింది. కరోనా పుట్టిల్లు చైనాతో సరిహద్దులను పూర్తిగా మూసేవేయడం నార్త్ పరిస్థితిని మరింత దిగజార్చింది. తన దేశంలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రపంచం ముందు మాత్రం బడాయి పోజులు కొట్టే కిమ్ జోంగ్ ఈ మధ్య స్వయంగా ఆహార సంక్షోభంపై మాట్లాడుతున్నారు.

  అణుబాంబులు కాదు అన్నంపై ఫోకస్..

  కిమ్ ప్రసంగంలో ఎక్కువ భాగం దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచాల్సిన ఆవశ్యకతపై దృష్టి సారించారు. ఆహార కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పకున్నా, 2021లో నార్త్ లక్షల టన్నుల బియ్యం కొరతతో సతమతమైందని కిమ్ అంగీకరించారు. అయితే, కొత్త ఏడాదిలో సమస్యలను అధిగమించగలమని, ఈ(2022) సంవత్సరం అననుకూల పరిస్థితులు ఉంటాయని, ప్రజలంతా వ్యవసాయ ఉత్పత్తిని పెంచి, దేశ ఆహార సమస్యను పూర్తిగా పరిష్కరించే దిశగా నడుం బిగించాలని కిమ్ పేర్కొన్నారు.

  చిక్కిపోయి.. అరగుండు వదిలేసి..

  కాగా, బొద్దుగా ఉండే కిమ్ ఈ మధ్య బాగా సన్నబడ్డారు. బుగ్గలు కరిగిపోయి, అరగుండుతో కాకుండా నిండుగా వెంట్రుకలతో ఉన్న కిమ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. నార్త్ కొరియాలో కరువు పరిస్థితులకు కిమ్ రూపమే నిదర్శనమంటూ నెట్టింట కామెంట్లు వచ్చాయి. అయితే, ఆరోగ్యంపై శ్రద్ద పెరగడం వల్లే కిమ్ లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని నార్త్ అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి. నిజానికి కిమ్ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారని వెస్ట్రన్ మీడియా ఎప్పటి నుంచో సాగిస్తోన్న ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేసింది. మొత్తంగా కిమ్ శరీరంలో, ఆలోచనలో చోటుచేసుకున్న మార్పులు ఆయననే దేవుడని నమ్మే ఉత్తర కొరియా ప్రజలకు మేలు చేస్తాయా? లేదా? అనేది వేచి చూడాలి..

  First published:

  Tags: Kim jong un, North Korea

  ఉత్తమ కథలు