#KIMJONGUNDEAD : కిమ్ జోంగ్ ఉన్ చనిపోయాడా? నివాళి అర్పిస్తున్న నెటిజన్లు...

#KIMJONGUNDEAD | Corona Lockdown | Corona Update : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరణంపై స్పష్టత రాకుండానే చనిపోయాడని ప్రజలు భావించే పరిస్థితి ఎందుకొస్తోంది?

news18-telugu
Updated: April 26, 2020, 6:10 AM IST
#KIMJONGUNDEAD : కిమ్ జోంగ్ ఉన్ చనిపోయాడా? నివాళి అర్పిస్తున్న నెటిజన్లు...
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
  • Share this:
#KIMJONGUNDEAD | Corona Lockdown | Corona Update : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంటే సహజంగానే ప్రపంచంలో చాలా మందికి కోపం. ఆయన అత్యంత దారుణ శిక్షలు వేయిస్తాడని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో... తాజాగా కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం దెబ్బతిందనీ, విషమించిందనీ, ఆయనకు హార్ట్ సర్జరీ తర్వాత పరిస్థితి బాలేదని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా చైనా డాక్టర్ల బృందం ఉత్తర కొరియా వెళ్లి... ఆయన ఆరోగ్యాన్ని సమీక్షించిందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఈ మొత్తం వ్యవహారంపై ఉత్తర కొరియా స్పందించకపోవడంతో... ట్విట్టర్ యూజర్లలో చాలా మంది కిమ్ జోంగ్ ఉన్ చనిపోయి ఉంటారని ఫిక్సైపోతున్నారు.


ప్రస్తుతం ట్విట్టర్‌లో కిమ్ జోంగ్ ఉన్ మరణంపై ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది ప్రత్యేక మీమ్స్ చేసి... ట్విట్టర్‌లో అప్ లోడ్ చేస్తున్నారు.


ఈ మీమ్స్‌లో కొన్ని కామెడీగా ఉంటే... మరికొన్ని కిమ్ జోంగ్‌పై ఉన్న కోపాన్ని తెలుపుతున్నాయి.


హాంకాంగ్‌లోని షిజియాన్ జింగ్జౌ టీవీ ఛానెల్ వైస్ డైరెక్టర్... తన వీబో అకౌంట్‌లో ఉత్తర కొరియా అధినేత చనిపోయారని... ఆ దేశ అత్యున్నత స్థాయి వర్గాల ద్వారా తెలిసిందని న్యూస్ ఇచ్చింది. ఆమె... చైనా విదేశాంగ మంత్రి మేనకోడలు. ఆమెకు వీబో (Weibo)లో కోటి 50లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.


కిమ్ జోంగ్ చనిపోయారన్న వార్తల్ని నార్త్ కొరియా స్టేట్ న్యూస్ ఏజెన్సీ అయిన కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఖండించింది. కానీ ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం ఎలా ఉందో మాత్రం చెప్పలేదు. రెండు వారాల కిందట చివరిసారిగా కిమ్ ప్రజలకు కనిపించారు.


నార్త్ కొరియా టీవీలో ప్రస్తుతం రొటీన్ వార్తలే వస్తున్నాయి. ఎప్పట్లాగే కిమ్ అది చేశాడు, ఇది చేశాడు, ఇరగదీశాడు అంటూ వార్తలొస్తున్నాయి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థపై వార్తలొస్తున్నాయి.


ఇంటర్నేషనల్ మీడియా ఛానెల్స్ మాత్రం 36 ఏళ్ల కిమ్ జోంగ్... హార్ట్ సర్జరీ తర్వాత కోలుకున్నారని చెబుతున్నాయి. అదే జరిగితే... మరి చైనా నుంచి డాక్టర్లు ఉత్తర కొరియాకి శుక్రవారం ఎందుకు వెళ్లారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా కిమ్ ఆరోగ్యంపై రకరకాల అనుమానాలు, ప్రశ్నలు అలాగే ఉన్నాయి.
Published by: Krishna Kumar N
First published: April 26, 2020, 6:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading