కిమ్ జోంగ్ ఉన్ అందుకే చనిపోయినట్లు నాటకం ఆడాడు..?

కిమ్ కావాలనే చనిపోయినట్లు వార్తలు సృష్టించాడట. 20 రోజుల పాటు ప్రపంచానికి కనిపించకుండా పోయారట.

news18-telugu
Updated: May 6, 2020, 9:03 AM IST
కిమ్ జోంగ్ ఉన్ అందుకే చనిపోయినట్లు నాటకం ఆడాడు..?
కిమ్ జోంగ్ ఉన్ (File)
  • Share this:
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోయాడంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కాదు.. బతికే ఉన్నాడని, బతికి ఉన్నా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. హృద్రోగ సంబంధిత వ్యాధికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత లేవలేని స్థితికి వెళ్లాడని కూడా కొందరు వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా మీడియా మాత్రం కిమ్మనకుండా ఉండిపోయింది. దాదాపు 20 రోజుల పాటు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూసింది. ఉత్తర కొరియా అధికారులు ఏ సమాచారం చెబుతారోనని అందరూ వేచి చూశారు. కిమ్ తర్వాత ఆయన చెల్లెలు అధికారం చేపడతారని, కాదు.. చిన్నాన్నదే అధికారం అని వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ మీడియా ముందుకు వచ్చాడు కిమ్. నవ్వుతూ ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా కనిపించాడు. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని సందర్శించి, అక్కడి వేడుకల్లో పాల్గొన్నారని ఉత్తర కొరియా మీడియా తెలిపింది.

అయితే, కిమ్ కావాలనే చనిపోయినట్లు వార్తలు సృష్టించాడట. 20 రోజుల పాటు ప్రపంచానికి కనిపించకుండా పోయారట. దాని వెనుక పెద్ద వ్యూహమే ఉందట. దేశంలో ఉన్న ద్రోహులను, శత్రువులను కనిపెట్టాలన్న ఉద్దేశంతోనే కిమ్ ఇలా చేశారని.. చనిపోయినట్లు ఫేక్ న్యూస్ ప్రపంచానికి లీక్ చేశారని విశ్లేషకులు అంటున్నారు. తన దగ్గరి వాళ్లకు తప్ప మిగతా దేశమంతా తాను చనిపోయినట్లు నిర్ధారించుకున్నారని.. ఈ క్రమంలో అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదిపిన వాళ్లను కిమ్ పసిగట్టాడని స్కై న్యూస్ ఆస్ట్రేలియా తెలిపింది.

చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్లు.. చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష వేస్తాడు కిమ్. నిల్చోబెట్టి కాల్చి చంపించేస్తాడు. అలాంటిది.. తాను చనిపోయినట్లు నటించిన సందర్భాల్లో కుట్రలు పన్నిన వారిని అస్సలు విడిచి పెట్టబోడని ఆ మీడియా తెలిపింది. కుట్రలు పన్నిన వాళ్లందర్నీ కిమ్ ఊచకోత కోస్తాడని వెల్లడించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 6, 2020, 9:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading