news18
Updated: November 24, 2020, 7:19 PM IST
image credits Twitter
- News18
- Last Updated:
November 24, 2020, 7:19 PM IST
పిల్లలు హెయిర్ కట్‌ను అసలు ఇష్టపడరు. సెలూన్‌కు వెళ్లినప్పుడు భయపడటం, జుట్టు కత్తిరించేటప్పుడు ఏడవడం సాధారణ విషయమే. వారిని మాటల్లో పెట్టి కటింగ్ పూర్తి చేయడం మనం చూస్తుంటాం. కానీ ఒక పిల్లవాడు తన జుట్టు కత్తిరించేటప్పుడు బార్బర్‌తో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఆ బాలుడి పేరు అన్ష్రుత్. అతడికి కటింగ్ చేసేటప్పుడు బాలుడి తండ్రి అనుప్ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అన్ష్రుత్ హావభావాలు (expressions) ఆకట్టుకునేలా ఉన్నాయంటూ చాలామంది ఆ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. రిచా చద్దా, దివ్య దత్తా వంటి బాలీవుడ్ నటులు కూడా దీన్ని రీ ట్వీట్ చేశారు.
సెలూన్‌కు వెళ్లడం, హెయిర్ కట్ చేయించుకోవడం అన్ష్రుత్కు ఇష్టం లేదని వీడియో ద్వారా తెలుస్తోంది. జుట్టు కత్తిరించేటప్పుడు బాలుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఏమార్చడానికి బార్బర్ బాలుడితో మాట కలిపాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. నీ పేరేంటి అని అడిగినప్పుడు "నా పేరు అన్ష్రుత్, అన్ష్రుత్కి హెయిర్ కట్ చేయవద్దు" అని అతడు అమాయకంగా చెప్పాడు. అయినా బార్బర్ వినకపోవడంతో.. ‘నేను చాలా కోపంగా ఉన్నాను. నేను నిన్ను కొడతాను’ అని బాలుడు కోపంగా అన్నాడు.
తొమ్మిది లక్షలమంది చూశారు...
ఈ వీడియోకు అనుప్.. "నా బిడ్డ అన్ష్రుత్. ఇది తల్లిదండ్రులందరి పోరాటం" అనే క్యాప్షన్ పెట్టి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 49,000 లైక్‌లు, కొన్ని వేల రీట్వీట్లు, దాదాపు తొమ్మిది లక్షల వ్యూస్ వచ్చాయి.
ఇంటర్నెట్లో ఇది ఒక ట్రెండింగ్ వీడియోగా మారింది. రిచా చద్దా, దివ్య దత్త సహా ఇతర ప్రముఖులు ఈ వీడియోను రీట్వీట్ చేశారు. బాలుడి ఎక్ప్రెషన్స్ బాగున్నాయని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీలే గాక ట్విట్టర్ లో నెటిజన్లకు ఈ వీడియో భాగా నచ్చింది. దీంతో వారంతా.. హౌ క్యూట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 24, 2020, 7:19 PM IST