• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • KIA SELTOS READY TO BE DELIVERED NOSEDIVES FROM DEALER SHOWROOM ONTO ROAD SU

డెలివరీ చేసే సమయంలో షోరూమ్‌ నుంచి రోడ్డుపైకి దూసుకొచ్చిన కియా సెల్టోస్.. ఎలా జరిగిందంటే?

డెలివరీ చేసే సమయంలో షోరూమ్‌ నుంచి రోడ్డుపైకి దూసుకొచ్చిన కియా సెల్టోస్.. ఎలా జరిగిందంటే?

(Image source: Rushlane)

మనం రోజు రోడ్లపై జరిగే కారు ప్రమాదాల గురించి వింటూనే ఉంటాం. కానీ షోరూమ్‌లోనే ప్రమాదం జరిగితే ఎలా ఉంటుంది?.

  • Share this:
    మనం రోజు రోడ్లపై జరిగే కారు ప్రమాదాల గురించి వింటూనే ఉంటాం. కానీ షోరూమ్‌లోనే ప్రమాదం జరిగితే ఎలా ఉంటుంది?. అలాంటి ఘటనే కియాకు చెందిన ఓ డీలర్ షోరూమ్‌లో జరిగింది. డెలివరీకి సిద్దం‌గా ఉన్న కారు.. షోరూమ్ వెలుపలికి దూసుకొచ్చింది. కియా సెల్టోస్ కారు షోరూమ్‌ నుంచి రోడ్డుపై పడటంతో కొంత భాగం దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే షోరూం వెలుపలు పెద్ద ఎత్తున జనాలు చేరారని రష్ లేన్ వెబ్‌సైట్ పేర్కొంది. అయితే ఈ ప్రమాదానికి వినియోగదారుడు బాధ్యత వహిస్తాడా? లేక డెలివరీ సమయంలో జరిగింది కాబట్టి షోరూమ్ యజమాన్యం బాధ్యత వహిస్తుందా? అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.ఇక, కియా కార్లు ఈ రకంగా ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి ఏమి కాదు. ఈ ఏడాది జూన్‌లో ఓ షోరూమ్‌లో కియా కార్నివాల్ వాహనం.. కాంపౌడ్ గోడను ఢీ కొట్టింది. అది కూడా డెలివరీకి సిద్ధంగా ఉన్న వాహనమే.

    అయితే ఈ ఘటన కారు కొనుగోలు చేసిన యజమాని తగిన డ్రైవింగ్ అనుభవం లేకపోవడం, కొత్త కారు కొన్న ఉత్సాహం వల్ల చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ షోరూమ్‌లో చాలా మంది ఉన్నారు. ఒకవేళ ప్రమాదం మరో విధంగా జరిగితే తీవ్ర నష్టం జరిగి ఉండేది.

    ఈ ఏడాది జూన్‌లో కియా సెల్టోస్ 10 అదనపు ఫీచర్లతో సరికొత్త మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్‌లో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, స్మార్ కీ రిమోట్ ఇంజన్ స్టార్ట్, సన్‌రూఫ్‌తో మరో 7 ఫీచర్లను పొందుపరిచింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు