Kia Seltos: కియా నుంచి సెల్టోస్ యానివర్సరీ మోడల్ విడుదల

కియా సెల్టోస్ కారును విడుదల చేసి సంవత్సరం అయిన సందర్భంగా ఆ మోడల్కు మరిన్ని మెరుగులు అద్ది కొత్త వేరియంట్ను అందుబాటులోకి తెచ్చింది కియా మోటార్స్ ఇండియా.

news18-telugu
Updated: October 16, 2020, 12:14 PM IST
Kia Seltos: కియా నుంచి సెల్టోస్ యానివర్సరీ మోడల్ విడుదల
కియా సెల్టోస్ యానివర్సరీ మోడల్
  • Share this:
కియా సెల్టోస్ కారును విడుదల చేసి సంవత్సరం అయిన సందర్భంగా ఆ మోడల్కు మరిన్ని మెరుగులు అద్ది కొత్త వేరియంట్ను అందుబాటులోకి తెచ్చింది కియా మోటార్స్ ఇండియా. గతంలో వచ్చిన రెగ్యులర్ వేరియంట్తో పోలిస్తే కొత్త సెల్టోస్ కారులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మార్పులు చాలా ఉన్నాయి. ఈ సరికొత్త సెల్టోస్ యానివర్సరీ ఎడిషన్ను HTX మోడళ్లలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విభాగంలో HTX 6MT- పెట్రోల్ ఇంజిన్ మోడల్ ధరను రూ.13,75,000(ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియా)గా నిర్ణయించారు. HTX IVT-పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ ధర రూ.14,75,000. HTX 6MT డీజిల్ వేరియంట్ ధర రూ.14,85,000.

ఎక్స్టీరియర్ మార్పులు

సెల్టోస్ ఎక్స్టీరియర్ మార్పుల్లో సిల్వర్ డిఫ్యూజర్ డోర్లు, టస్క్ షేప్ స్కిడ్ ప్లేట్, టాన్జేరిన్ ఫాగ్ లాంప్ బెజెల్, టాన్జేరిన్ సెంటర్ క్యాప్తో 17 అంగుళాల రావెన్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ వన్ టోన్ ఇంటీరియర్స్, హనీ కోంబ్ ప్యాటర్న్తో వచ్చే రావెన్ బ్లాక్ లెథర్ సీట్లు వంటివి ఉన్నాయి. ఈ మార్పులతో సెల్టోస్ మరింత స్టైలిష్గా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ కారు పొడవును పాత మోడల్తో పోలిస్తే 60మిల్లీమీటర్ల మేరకు పెంచారు.

నాలుగు రంగుల్లో సరికొత్తగా..
సెల్టోస్ యానివర్సరీ ఎడిషన్ మొత్తం నాలుగు రంగులలో లభిస్తుంది. అరోరా బ్లాక్ పెరల్తో గ్లేసియర్ వైట్ పెరల్, అరోరా బ్లాక్ పెరల్తో స్టీల్ సిల్వర్, అరోరా బ్లాక్ పెరల్తో గ్రావిటీ గ్రే వంటి మూడు డ్యుయల్ టోన్ కలర్ స్కీమ్లలో పాటు మోనోటోన్ అరోరా బ్లాక్ పెరల్ కలర్లో కొత్త సెల్టోస్ను కస్టమర్లకు అందుబాటులో ఉంచారు.

మిడ్ ఎస్యూవీలో టాప్ బ్రాండ్
మిడ్ ఎస్యూవీ రేంజ్లో సెల్టోస్ సరికొత్త బెంచ్మార్క్ను క్రియేట్ చేసిందని చెబుతున్నారు కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కుఖ్యూన్ షిమ్. 2019లో విడుదల చేసిన సెల్టోస్ మోడల్తో దేశంలో ఉత్తమ బ్రాండ్గా కియాకు పునాది పడిందని ఆయన చెప్పారు. ప్రీమియం ఫీచర్లు, విలక్షణమైన డిజైన్, సుప్రీం క్వాలిటీ, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు కియా సెల్టోస్కు మంచి ఆదరణను తీసుకొచ్చాయని తెలిపారు. ‘భారతదేశంలో మిడ్-ఎస్యూవీ కస్టమర్ల డిమాండ్లకు తగ్గట్టుగా రూపొందించిన ఈ మోడల్ విజయవంతమైంది. దీనికి మరికొన్ని మార్పులు చేసి కియా సెల్టోస్ యానివర్సరీ ఎడిషన్ను విడుదల చేస్తున్నాం. ఇది మా బ్రాండ్ విలువను, కియోపై కస్టమర్ల ప్రేమను మరింత పెంచుతుందని ఆశిస్తున్నాం’ అని ఆయన వివరించారు.

అదనపు ఫీచర్లతో ఆకట్టుకుంటోంది
కొత్త సెల్టోస్లో బ్లాక్ వన్ టోన్ ఇంటీరియర్స్, హనీ కోంబ్ ప్యాటర్న్ రావెన్ బ్లాక్ లెధర్ సీట్లు ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్లో రిమోట్ ఇంజిన్ స్టార్ట్, స్టాప్ ఆప్షన్ కూడా ఉంది. ఇది పెట్రోల్, డిజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్ స్ట్రీమ్ పెట్రోల్ 1.5 ఇంజిన్.. సిక్స్ స్పీడ్ మాన్యువల్ IVT ట్రాన్స్మిషన్లతో ఉంటుంది. డీజిల్ 1.5 CRDi VGT ఇంజిన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్తో కలిసి లభిస్తుంది. గతేడాది విడుదల చేసిన కియా సెల్టోస్ కారుకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందింది. ఒక సంవత్సరంలోపు లక్ష యూనిట్ల అమ్మకాలు నమోదు కావడం విశేషం. దేశంలో స్థిరంగా, అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-ఎస్యూవీలలో సెల్టోస్ ఒకటి.
Published by: Sumanth Kanukula
First published: October 16, 2020, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading