Viral Video: కియా కారును డెలివరీ చేస్తున్న రోబో.. ఆశ్చర్యపరిచే ఈ వీడియో చూడండి

కేరళలో ఓ రోబో సందడి చేస్తోంది. అది కూడా కియా మోటర్స్ కు చెందిన కియా ఆథరైజ్డ్ డీలర్షిప్ వారు రోబో సేవలను అందుబాటులోకి తెచ్చి కస్టమర్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.

news18-telugu
Updated: November 25, 2020, 4:40 PM IST
Viral Video: కియా కారును డెలివరీ చేస్తున్న రోబో.. ఆశ్చర్యపరిచే ఈ వీడియో చూడండి
సేవలు అందిస్తున్న రోబో(Image source: Rushlane)
  • Share this:
కేరళలో ఓ రోబో సందడి చేస్తోంది. అది కూడా కియా మోటర్స్ కు చెందిన కియా ఆథరైజ్డ్ డీలర్షిప్ వారు రోబో సేవలను అందుబాటులోకి తెచ్చి కస్టమర్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. బ్రాండ్ న్యూ కియా సోనెట్ వాహనాన్ని డెలివరీ తీసుకునే సమయంలో ఊహించని రీతిలో కస్టమర్ ను ఆశ్చర్యపరచిన డీలర్ల వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. SUV ని రోబో (robot) చేతుల మీదుగా కస్టమర్ తీసుకోవడంతో ఇప్పుడు మళయాళీలంతా దీనిపైనే చర్చిస్తున్నారు. గతంలో కియా మోటర్స్ ఏ షోరూంలోనూ చేయని ఈ ప్రయోగం ఇప్పుడు భలే ఆకట్టుకుంటోంది. హ్యూమనాయిడ్ (humanoid)రోబో అయిన సాయాబోట్ (Sayabot) సోనెట్(sonet) వెహికల్ ను కస్టమర్ కు హ్యాండోవర్ చేసేలా కియా ఆటోమేకర్ చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి అభిమానాన్ని చూరగొంటోంది. దీన్ని స్పెషల్ డెలివరీగా పేర్కొన్నారు.

వీడియో వైరల్..

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను కియా మోటర్స్ (Kia motors) నెటిజన్స్ తో పంచుకోగా దీనికి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ వీడియోను లైక్ చేస్తూ, షేర్ చేస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కస్టమర్ కు కారు తాళం చెవి, అవసరమైన డాక్యుమెంట్లను అందజేసిన హ్యూమనాయిడ్ రోబో ఏకంగా ఈ కారు గురించి మాట్లాడటమే కాదు కియా సోనెట్ ప్రత్యేకతల గురించి ప్రసంగించి అందరికీ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కియా మోటర్స్ కస్టమర్ సర్వీసుపై షోరూం స్టాఫ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సైతం ఇచ్చిన ఈ రోబో భలే ఆకట్టుకుంది.

బెస్ట్ సెల్లింగ్
ఈ ఏడాది లాంచ్ అయినా కియా సోనెట్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ (best selling) ఆటోమొబైల్ గా సందడి చేస్తోంది. మోస్ట్ అఫోర్డబుల్ బేస్ వేరియంట్ కియా సోనెట్ ధర కేవలం రూ.6.8 లక్షలే కాగా ఇది మధ్యతరగతి వారిని బాగా ఆకట్టుకుంటోంది. 3 ఇంజిన్ ఆప్షన్స్ ను సపోర్ట్ చేసే కియా సోనెట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బోచార్జ్ డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజల్ ఇంజిన్ వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో 82Bhpతో 115Nm పీక్ టార్క్ ఇస్తుంది. 1.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తో 118Bhp ఉన్న ఇంజిన్ 172 Nm పీక్ టార్క్ ఇస్తుంది. 1.5 లీటర్ డీజల్ ఇంజిన్ 2 స్టేట్ ఆఫ్ ట్యూన్స్ లో అందుబాటులో ఉంది. టెక్ లైన్ వేరియంట్స్ గరిష్ఠంగా 99Bhp ప్రొడ్యూస్ చేస్తుండగా, టాప్ ఎండ్ GTX+ తో 113Bhp ఇస్తుంది.


3 నిమిషాలకు ఓ బుకింగ్

కియా మోటర్స్ చెబుతున్న వివరాల ప్రకారం కియా సోనెట్ పెద్ద హాట్ కేక్ లా మారింది. యావరేజ్ గా ప్రతీ 3 నిమిషాలకు ఒక కియా సోనెట్ బుక్ అవుతోంది. సెల్టాస్ తో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన కియా మోటర్స్ సేల్స్ ఈ దీపావళికి మరింత పుంజుకున్నాయి. BS6 ఎమిషన్ నార్మ్స్ లోకి ఎంటర్ అవుతున్న దశలో అట్రాక్టివ్ ప్యాకేజీగా ఇండస్ట్రీకి కలిసి వచ్చింది కూడా.

కేరళలో (kerala) రోబో కల్చర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుండగా కోవిడ్ (covid) మహమ్మారి కారణంగా రోబో సేవలను పోలీస్ శాఖలో కూడా విస్తృతంగా ఉపయోగించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కోవిడ్-19 హెల్త్ అఫిషియల్స్, వర్కర్స్ కు ఆఫీసర్ గా వీటిని చేర్చారు. ఇక్కడ రెస్టారెంట్స్ లో కూడా రోబోల వాడకం క్రమంగా పెరుగుతోంది. టూరిస్టులకు స్వర్గధామమైన కేరళలో రోబోల వాడకం ద్వారా పర్యాటకంలో కొత్త పుంతలు తొక్కే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
Published by: Nikhil Kumar S
First published: November 25, 2020, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading