Kgf movie prashanth nil direction tatha background: కేజీఎఫ్ సినిమా మొదటి చాప్టర్ రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వేల్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF Movie) ను అద్భుతంగా తెరకెక్కించారు. హీరో యశ్ (Yash hero) నటించిన ఈ సినిమా.. తొలిరోజు నుంచి రికార్డులను తిరగరాస్తుంది. అయితే, ఈ సినిమాలో నటించిన అందరు అద్భుతంగా నటించారు. ఇప్పటికే వీరి నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.
ఈ క్రమంలో అభిమానులు ఈ సినిమాలోని క్యారెక్టర్ ల గురించి గూగుల్ సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే యశ్ భాయ్(రాఖీ)కి (Yash bhai) తల్లిగా చేసిన అర్చనజోయిస్ గురించి సెర్చ్ చేశారు. దీంతో ఆమె రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె ఇంటర్య్వూల (KGF movie) కోసం ప్రముఖ ఛానెల్స్ పోటీపడుతున్నాయి. ఆమె ఇంటి ముందు అభిమానులు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాలో అంధుడిగా నటించిన తాత వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు.
కేజీఎఫ్ (Kgf movie) మూవీలో.. అంధుడిగా నటించి ఆడియన్స్ కు ఎమోషనల్ చేసిన వ్యక్తి పేరు కృష్ణాజీ, (krishnaji) ఆయన ఏపీ, కర్ణాటక బార్డర్ లో ఉంటారు. ఆయనకు చిన్న తనంనుంచే సినిమాలు చూడటం అంటే ఆసక్తి. అప్పటి నుంచే ఎన్టీఆర్, అక్కినేని సినిమాలను ఇష్టంగా చూసేవాడు. ఈ క్రమంలో ఆయనకు భీమ్ వెంకటేష్ అనే ప్రొడ్యుసర్ తొ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత... ఒక బాయ్ దగ్గర టచప్ బాయ్ గా పనిచేశాడు. ఈ క్రమంలో శంకర్ నాగ్ తో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కృష్ణాజీ చేరారు. ఈ సమయంలో ఆయనకు కేజీఎఫ్ సినిమాలో నటించే సువర్ణ అవకాశం దక్కింది. ఇక పాత్రలో కృష్ణాజీ అద్భుతంగా నటించారు. ఈ కథలో ఒదిగిపోయి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: KGF, KGF Chapter 2, Rakhi film, Tollywood, Tollywood film, Yash