Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా ఇవి గుర్తుంచుకోండి..

పర్సనల్ లోన్ తీసుకోవాలంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. తక్షణ ఆర్థిక అవసరాలను గట్టేక్కేందుకే పలువురు పర్సలోన్ తీసుకుంటారు. అయినప్పటికీ.. దీనిని అసురక్షితమైన రుణంగానే భావిస్తుంటారు.

news18-telugu
Updated: September 20, 2020, 12:44 PM IST
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా ఇవి గుర్తుంచుకోండి..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పర్సనల్ లోన్ తీసుకోవాలంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. తక్షణ ఆర్థిక అవసరాలను గట్టేక్కేందుకే పలువురు పర్సలోన్ తీసుకుంటారు. అయినప్పటికీ.. దీనిని అసురక్షితమైన రుణంగానే భావిస్తుంటారు. ఎందుకంటే పర్సనల్ లోన్ తీసుకోంటే దానిపై వడ్డీ, కాలపరిమితి, ‌ఇతర నిబంధనలు.. ఇలా చాలా లెక్కలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునేవారు ఏ అంశాలను పరిగణలోని తీసుకోవాలనే దానిపై డిజిటల్ లెండింగ్ ఫిన్‌టెక్ స్టార్టప్ రేవ్‌ఫిన్ సీఈవో సమీర్ అగర్వాల్ కొన్ని సూచనలు చేశారు.

అవసరాలను అంచనా వేయాలి..

లోన్ ఏ కారణం కోసం తీసుకుంటున్నామనేదాని గురించి రుణగ్రహీత ఒకటికి పలుమార్లు ఆలోచించుకోవాలి. అవసరానికి మనదగ్గర ఉన్న సేవింగ్స్ సరిపోతాయా, లేక అవసరాన్ని వాయిదా వేయగలమా అనే అంశాలను పలుమార్లు మనలో మనమే చెక్ చేసుకోవాలి. ఇక, తప్పదు అనుకుంటే ఎంత మొత్తం తీసుకోవాలి, ఎంత కాలపరిమితితో తీసుకోవాలి అనే అంచనాకు రావాలి.

అర్హతను చెక్ చేసుకోవాలి..
మాములుగా రుణాలు ఇచ్చే సంస్థలు.. క్రెడిట్ స్కోర్, ఆదాయం, స్థోమతను చూస్తారు. అవికాకపోతే.. రుణగ్రహీత తాకట్టు పెట్టే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన అర్హత ప్రమాణాలు.. రుణాలు జారీ చేసే సంస్థల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. ఎంత రుణం తీసుకుంటే ఏ రకంగా వాయిదాలు చెల్లించాలి అనే సమాచారం అక్కడ లభిస్తోంది.

రుణంపై ఇతర చార్జీలు..
తీసుకునే రుణంపై ఎంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుందో చూసుకోవాలి. అది మొత్తం కాలపరిమితిలో ఎంత చెల్లించే మొత్తంతో సమానంగా ఉందా లేదా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అలాగే లేట్ పేమెంట్‌పై ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజర్ చార్జీలపై ముందే తెలుసుకోవాలి.రుణంపై వడ్డీ వర్తించే విధానం..
మాములుగా పర్సనల్ ‌లోన్స్‌కు సంబంధించి వడ్డీ తగ్గింపు పద్ధతిని అవలంభిస్తారు. వడ్డీ అనేది తీసుకున్న మొత్తంపై కాకుండా.. నెలవారీగా మిగిలిన ప్రధాన మొత్తంపై వడ్డీని లెక్కించాల్సి ఉంటుంది. తగ్గింపు పద్ధతిలో వడ్డీ చెల్లించడమనేది.. ప్లాట్ బేసిస్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వడ్డీ విధానంపై జాగ్రత్తగా వహించాలి..

రుణదాత విశ్వయనీయత..
మనం రుణం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో ఆ సంస్థ విశ్వసనీయతను కూడా ఒకసారి చెక్ చేసుకోవడం ముఖ్యం. అంతకు ముందు ఆ సంస్థ నుంచి రుణం పొందిన ఇతరుల అనుభవం ఆధారంగా మనం విశ్వసనీయతను గుర్తించవచ్చు. బ్యాంకు రుణాలు ఇవ్వడంలో నమ్మకమైన సంస్థలుగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్స్ , ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల గూగుల్ ప్లే స్టోర్ రేటింగ్స్ ఒకసారి పరిశీలిస్తే.. రుణగ్రహీతలు వారికి కావాల్సిన దానిపై ఒక స్పష్టత ఏర్పుచుకునే అవకాశం ఉంటుంది.

చివరిగా..
ఈఎంఐ ప్రొటెక్షన్ ప్లాన్, జీవిత బీమా వంటివి తీసుకోవడం వలన.. చనిపోయిన, ఉద్యోగం కోల్పోయిన, ఆస్పత్రిలో చేరిన సందర్భాల్లో రుణం చెల్లించడంలో సహాయంగా నిలుస్తాయి. ఇక, రుణగ్రహీతలు లోన్ తీసుకోనే సమయంలో తిరిగి చెల్లించే క్రమాన్ని తప్పనిసరిగా ఆలోచించాలి. సాధారణంగా.. తీసుకునే మొత్తం పెద్దద్దిగా, కాలపరిమితి ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. అలాగే లోన్ తీసుకునేటప్పడు సమర్పించే పత్రాలు, దరఖాస్తు ప్రక్రియ, నిబంధనలను పరిశీలించి వివేకమైన నిర్ణయం తీసుకోవాలి.
Published by: Sumanth Kanukula
First published: September 20, 2020, 12:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading