Kerala: ఒక మహిళ తన కుటుంబం కోసం తినడానికి ఒక హోటల్ నుంచి పరోటా ఆర్డర్ పెట్టింది. కాసేపటికి డెలివరీ బాయ్ పార్శిల్ ఇచ్చి వెళ్లాడు. అది తెరచి చూసిన మహిళ షాకింగ్ కు గురయ్యింది.
చాలా చోట్ల హోటళ్లు, రెస్టారెంట్ లలో (Hotels) నిర్వాహకులు సరైన శుభ్రతను పాటించడం లేదు. కనీసం వ్యక్తిగత పరిశుభ్రత, ఆహరం తయారు చేసే చోట తీసుకొవాల్సిన కనీసం జాగ్రత్తలు తీసుకొవడం లేదు. క్వాలిటీ లేని వస్తువులను ఉపయోగించి ఆహరంను తయారు చేస్తున్నారు. ఇలాంటి పదార్థాలను తిన్న కస్టమర్ లు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ఆహర పదార్థాలలో బొద్దింకల అవశేషాలు, బూజులు వంటివి వచ్చిన ఘటనలు వార్తలలో నిలిచాయి.
కొన్ని చోట్ల పార్శిల్స్ లో (Parotta Parcel) కూడా జంతువులు కళేబరాలు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరగ్గానే ఫుడ్ సెఫ్టీ అధికారులు కొన్ని రోజుల పాటు హడావిడి చేస్తారు. హోటళ్లకు జరిమానాలు విధించడం, నోటీసులు జారీచేయడం చేస్తారు. కొన్ని రోజుల పాటు హోటళ్లు మూసిఉంచేలా చూస్తారు. ఆ తర్వాత.. కొందరు యథావిధిగా మాముళ్లు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తారు. ప్రస్తుతం ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ఒక మహిళకు వింత అనుభవం ఎదురైంది.
పూర్తి వివరాలు.. కేరళలోని (Kerala) ఈ సంఘటన జరిగింది. తిరువనంతపురం మే 5 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఒక మహిళ షాలిమార్ హోటల్ (Shalimar Hotel) పరోటా ఆర్డర్ (Parotta Parcel) పెట్టింది. కాసేపయ్యాక డెలివరీ బాయ్ పార్శిల్ ను పెట్టి వెళ్లారు. ఆ మహిళ పరోటాలు తినడానికి పార్శిల్ తెరచిచూసింది. ప్లేటులో పరోటాలు వేసుకుంది. అప్పుడు వెంటనే షాకింగ్ కు గురయ్యింది. పరోటా పై పాము అవశేషం (snake skin) ఉండం గమనించింది. చిన్న పాము.. పొలుసు పరోటాపై (snake skin) ఉండటాన్ని మహిళ చూసింది. వెంటనే దాన్ని ఫోటోలు తీసుకుంది.
హోటల్ సిబ్బందిపై సీరియస్ అయ్యింది. ఆ తర్వాత... మున్సిపల్ అధికారులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు షాలిమార్ హోటల్ ను సందర్శించారు. అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం ఉండటం గమనించారు. ఈ క్రమంలో హోటల్ యజమానికి నోటీసులు ఇచ్చారు. అధికారులు, అక్కడ ఉన్న ఆహారాన్ని పరీక్షల కోసం ల్యాబ్ కు తరలించారు. ప్రస్తుతం షాలిమార్ హోటల్ ను తాత్కలికంగా మూసి వేశారు. ఒక వేళ ఆ ఫుడ్ గమనించకుండా తింటే తమ పరిస్థితి ఏంటని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.