హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీని హత్తుకుని ఏడ్చేసిన బాలిక.. వైరల్ వీడియో..

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీని హత్తుకుని ఏడ్చేసిన బాలిక.. వైరల్ వీడియో..

పాదయాత్రలో ఎమోషనల్ అయిన బాలిక

పాదయాత్రలో ఎమోషనల్ అయిన బాలిక

Kerala: రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్ర జోష్ గా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఒక బాలిక పాదయాత్రలో పాల్గొని, రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) భారత్ జోడోయాత్రలో (Bharat jodo yatra)  దూసుకుపోతున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. వచ్చే లోక్ సభ ఎన్నికలలో తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే క్రమంలో రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో (kerala)  కొనసాగుతుంది. ఇదిలా ఉండగా రాహుల్ యాత్రలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. అదిప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక బాలిక రాహుల్ గాంధీతో కలిసి నడవాటానికి ప్రయత్నించింది.ఆమెను గమనించిన రాహుల్ ఆమెను దగ్గరకు తీసుకున్నారు. ఆమె భుజంపై తట్టి.. తన పక్కన నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్లారు.

అయితే.. తన అభిమాన నాయకుడితో కలిసి నడవడంతో బాలిక ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. తన కన్నీళ్లను ఆపులేకపోయింది. తన స్నేహితురాలిని చూసుకుంటూ ఏడుస్తునే పాదయాత్రలో పాల్గోంది. అయితే.. రాహుల్ మాత్రం ఆమెను ఓదారుస్తు.. నేనున్నాంటూ ధైర్యం చెప్పి, బాలికను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ (Viral video)  గామారింది.

రాహుల్ భారత్ జోడో యాత్ర 18 వ రోజు కేరళలో కొనసాగుతుంది. కాగా, గతంలో ఒక బాలుడిని రాహుల్ తన భుజంపై ఎత్తుకుని పాదయాత్రలో నడిచారు. అదే విధంగా.. ఒక చిన్నారి షూలేస్ ఊడిపొగ రాహుల్ గాంధీ తిరిగి మరల దాన్ని టైట్ గా కట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన కాంగ్రెస్ 3,570 కిలోమీటర్ల 150 రోజుల సుదీర్ఘ యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది.

ఇదిలా ఉండగా బీహార్ లో (Bihar) ఒక వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది.

నలందకు చెందిన వ్యక్తి దసరా నవరాత్రి సందర్భంగా కొన్ని కంపెనీలు ఆఫర్ లను ప్రకటించాయి. దీంతో ఒక వ్యక్తి డ్రోన్ కెమెరాలు కొనాలనుకున్నాడు. అతను వెంటనే మీషో నుంచి డ్రోన్ కెమెరాను ఆర్డర్ పెట్టాడు. అయితే.. కొన్ని రోజుల తర్వాత.. డెలీవరీ బాయ్ వచ్చి అతను ఇచ్చిన ఆర్డర్ ను తెరిచాడు. అప్పుడు డెలీవరీ అయిన ఐటమ్ చూసి షాక్ కు గురయ్యాడు. కాగా, చైతన్య కుమార్ అనే వ్యక్తి, మీషో నుండి తగ్గింపు ధరకు DJI డ్రోన్ కెమెరాను ఆర్డర్ చేసినట్లు చేశాడు. అతను ఆర్డర్ చేసిన డ్రోన్ కెమెరా మార్కెట్ విలువ రూ. 84,999 అయితే మీషోలో రూ.10,212కి పొందుతున్నాడు.

అతను కొంచెం అనుమానించాడు. కంపెనీకి తనకు జరిగిన మోసం పట్ల స్పష్టత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. భారీ ఆఫర్ ఉందని, అందుకే తక్కువ ఖర్చుతో కెమెరాను తీసుకుంటున్నానని మీషో చెప్పాడు. అతను పూర్తిగా ఆన్‌లైన్‌లో చెల్లింపు చేశాడు. దీనిపై కంపెనీకి కూడా ఫిర్యాదు చేశాడు. దీనిపై పర్వాల్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ దరఖాస్తు అందిన తర్వాత ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bharat Jodo Yatra, Congress, Kerala, Rahul Gandhi

ఉత్తమ కథలు