Home /News /trending /

KERALA VENJARAMOODU NATIVE REMARRIAGE AFTER 8 YEARS THE REASON IS CUTE AND HEART TOUCHING WEDDING GOES VIRAL PAH

పెళ్లైన 8 ఏళ్లకు.. భార్యకు, భర్త అదిరిపోయే గిఫ్ట్.. కూతురే సాక్షి.. అసలు కథేంటంటే..

భార్యకు అదిరిపోయే కానుక ఇచ్చిన భర్త

భార్యకు అదిరిపోయే కానుక ఇచ్చిన భర్త

Kerala: ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పారు. దీనికి వారు వ్యతిరేకించారు. కట్టుబట్టలతో యువతి.. తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది.

సమాజంలో  ఎంతో మంది యువత ప్రేమించుకుంటారు. కానీ కొంత మందే తమ ప్రేమను (love story)  గెలిపించుకుంటారు. కొంత మంది కన్న వారిని కాదన లేక తమ ప్రేమను చంపుకుంటారు. మరి కొందరు ఇంట్లో వారిని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత.. మరల ఇంటికి వచ్చేస్తుంటారు. కొందరు తాము.. ప్రేమించిన వారి కోసం ఎంతటి త్యాగం చేయడానికైన వెనుకాడరు. చివరి వరకు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైన, ఎదురొడ్డి తమ ప్రేమను గెలిపించుకుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కేరళలోని (Kerala)  ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక లవ్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట (Socia media)  వైరల్ గా మారింది. వెంజరమూడుకు చెందిన అనీష్, రజిత ఏడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అప్పుడు వారి ప్రేమను ఇంట్లో వారు ఒప్పుకొలేదు. దీంతో రజిత ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్లిపోయింది. వీరిద్దరు డిసెంబరు 29, 2014 లో పెళ్లి చేసుకున్నారు. రజిత ఎంకామ్ చదువుతుండగా, అనీష్ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఉండేవాడు. అనీష్ ఉద్యోగం చేస్తునే.. తన భార్య చదువుల కోసం ఆసరాగా నిలబడ్డాడు. ఆమె కామర్స్ లో పీహెచ్ డీ పూర్తి చేసి గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తుంది. అయితే, రజిత ఏ పెళ్లి వేడుకకు వెళ్లిన మూడీగా ఉండేది.

పెళ్లి విషయంలో మాత్రం.. అసంతృప్తిగా ఉండేది. తమ పెళ్లి పెద్దల ఆశీర్వాదం లేకుండా, ఎలాంటి ఎంజాయ్ మెంట్ లేకుండా జరిగిపోయిందని బాధ పడుతుండేది. దీన్ని ఆమె భర్త గమనించాడు. వీరికి ఒక పాప పుట్టింది. ఆమెకు ఏడేళ్లు. ఆమెను ముద్దుగా అమ్ము అని పిలుచుకునే వారు. అయితే, తన భార్య పడుతున్న వేదనను ఎలాగైన దూరం చేయాలని అనుకున్నాడు. దీని కోసం ఏమైన చేయాలని అనీష్ అనుకున్నాడు. ఈ క్రమంలో తన మిత్రులను సంప్రదించాడు. ఇంతలో అతని పెళ్లి రోజు వచ్చింది. అప్పుడు ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. బంధువులు, స్నేహితులను ఇన్ వైట్ చేశారు. గ్రాండ్ గా పెళ్లి వేడుక ప్లాన్ చేశారు.

అందరి మధ్యలో వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశారు. తిరువనంతపురం లోని అట్టుకల్ దేవాలయం, శంఖుముఖం బీచ్ తో సహా వివిధ ప్రదేశాలలో సేవ్ ది డేట్, ఫ్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్  (Wedding phot shoot) కార్యక్రమం నిర్వహించారు. వీరి ఫోటోలు ఆ జంట ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఆల్బమ్ తయారయింది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు ట్రెండింగ్ మారాయి. అనీష్ తన భార్యకు ఇచ్చిన సర్ ప్రైజ్ కానుకకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనీష్ తన భార్య కోసం.. అందమైన కవిత కూడా రాశాడు. అదే విధంగా.. అనీష్ పదిహేనేళ్లలోపు దివ్యాంగులైన పిల్లలకు సహాయం కోసం స్నేహ యాత్ర అనే స్వచ్ఛంద సంస్థను వలియాకొట్టక్కల్ లో నిర్వహిస్తున్నారు. ఈ బృందం వరదల సమయంలో, అన్నార్థులకు, అవసరమైన వారికి అవసరమైన వారికి సహాయం అందిస్తుంది. అంతేకాకుండా రక్తదాన శిబిరాలను కూడా అనీష్ తమ మిత్రులతో కలసి నిర్వహిస్తుంటారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Kerala, Love story, VIRAL NEWS, Wedding

తదుపరి వార్తలు