Fine For Not Wearing Helmet In Car : ఇటీవల కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది చనిపోయి అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్న సంఘటనలను మనం చూస్తున్నాం. అందుకే రోడ్డు ప్రమాదలను తగ్గించాలని రోడ్డు రవాణా శాఖ పలురకాల రూల్స్ ను ప్రవేశపెట్టింది. హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయడం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం తాగి వాహనాలను డ్రైవ్ చేయకపోవడం వంటి పలురకాల రూల్స్ ను కఠినతరం చేసింది. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసిన, రాంగ్ రూట్ లో వచ్చిన, సిగ్నల్స్ క్రాస్ చేసిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే చలానా వేసేస్తున్నారు. ఈ క్రమంలోనే హెల్మెట్ పెట్టుకోని కారణంగా ఒక వ్యక్తికి కూడా 500 రూపాయల చలానా వేశారు. అయితే అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పోలీసులు చలానా వేసింది ద్విచక్రవాహన దారుడికి కాదు,ఒక కారు నడిపే వ్యక్తికి.
కారు నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని అతనికి ఫైన్ వేసారు ట్రాఫిక్ పోలీసులు. మారుతి ఆల్టో కారు ఉన్న వ్యక్తి హెల్మెట్ పెట్టేకోకుండా కారు నడుపుతున్నాడంటూ రూ.500 జరిమానా విధిస్తూ చలానాను పంపించారు. కారును డ్రైవ్ చేసే వ్యక్తి హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాడు, సీట్ బెల్ట్ కదా పెట్టుకోవాల్సిందనే ఆలోచన లేకుండా అతడికి ఫైన్ విధించారు. కేరళలో ఈ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అయితే చలానా అందుకున్న ఆ కారు ఓనర్‌కి కారులో హెల్మెట్ పెట్టుకోవడం ఏమిటనే డౌట్ వచ్చింది కట్ చేస్తే..ట్రాఫిక్ అధికారులు చేసిన ఈ చిన్న పొరపాటుతో అతను చిక్కుల్లో పడ్డాడు. జరిగిన పొరపాటు గురించి తెలియజేయడానికి చెప్పడానికి పోలీసులు చుట్టూ తిరుగుతున్నాడు.
ALSO READ Shocking : డబ్బులు అడిగిందని,గర్ల్ ఫ్రెండ్ ని దారుణగా చంపేశాడు
కేరళకు చెందిన ఏ అజిత్ అనే వ్యక్తికి ఓ మారుతీ ఆల్టో కారు ఉంది. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ (KL21D9877).అయితే గతేడాది డిసెంబర్ ఏడో తేదీన అజిత్ కు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఓ చలానా వచ్చింది. మారుతి ఆల్టో కారు నడుపుతూ హెల్మెట్ పెట్టుకోలేదని ఎ.అజిత్‌కి జరిమానా విధిస్తూ చలానాను పంపించారు. ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్లినందుకు ఫైన్ విధిస్తున్నట్టు ఆ చలానాలో క్లియర్ గా రాసి ఉంది. అయితే విచిత్రంగా వాహనం కేటగిరిలో మాత్రం మోటారు కారు అని రాశారు. దానిపై అజిత్ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ (KL21D9877) వేశారు. కారులో ఉన్న వ్యక్తికి హెల్మెట్ తో పనేంటనే విషయాన్ని కూడా గుర్తించకుండా గుడ్డిగా చలానా రాసేశారు ట్రాఫిక్ పోలీసులు.
ALSO READ Drunken Man : రియల్ ఉపేంద్ర..రోడ్డు మధ్యలో కూర్చొని బ్రేక్ ఫాస్ట్
నిజానికి ఆ చలాన్ ఒక బైక్ వాహనదారుడిది. అతనికి పంపించాల్సిన చలాన్ పొరపాటున అజిత్ కు వెళ్ళింది. అజిత్ కారు నంబరును పోలి ఉన్న బైక్ నెంబరును ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీయడంతో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది. కాగా కంప్యూటర్ లో చలాన్ వివరాలు ఎక్కించేటప్పుడు బైక్ మీద ఉన్న చివరి సంఖ్యలు 77కి బదులుగా అజిత్ కారు నంబర్ 11ని వేయడంతో ఈ పొరపాటు జరిగింది. చలానాను చూసి మొదట ఆశ్చర్యపోయిన అజిత్ ఆ పొరపాటు గురించి తెలియజేయడానికి ట్రాఫిక్ పోలీసుల చుట్టూ తిరగాడు. అయినా ఫలితం లేకపోవడంతో అజిత్ ఈ సమస్యను పరిష్కరించేందుకు మోటార్ వాహనాల శాఖకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే ఆ అధికారులను సంప్రదించినప్పుడు సిస్టమ్ లో రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నమోదు చేసేటప్పుడు చిన్న పొరపాటు వల్ల ఇది జరిగిందని పోలీసులు చెప్పారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, Traffic fine, Traffic police