హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Flex : నన్ను నేను అభినందిస్తున్నా..10 పాస్ అయిన ఆనందంలో ఊర్లో ప్లెక్సీలు

Viral Flex : నన్ను నేను అభినందిస్తున్నా..10 పాస్ అయిన ఆనందంలో ఊర్లో ప్లెక్సీలు

10 పాసయ్యాడని ప్లెక్సీ

10 పాసయ్యాడని ప్లెక్సీ

Teenager prints flex announcing he passed 10th : 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు(Board exams) ప్రజలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ పరీక్షల తర్వాతే విద్యార్థి కెరీర్ సరైన దిశలో సాగుతుందని నమ్ముతారు. తమ పిల్లలకు ఈ పరీక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనని తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతుంటారు. చదువులో చురుకుదనం లేని పిల్లలు, వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందే తల్లిదండ్రుల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది.

ఇంకా చదవండి ...

Teenager prints flex announcing he passed 10th : 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు(Board exams) ప్రజలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ పరీక్షల తర్వాతే విద్యార్థి కెరీర్ సరైన దిశలో సాగుతుందని నమ్ముతారు. తమ పిల్లలకు ఈ పరీక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనని తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతుంటారు. చదువులో చురుకుదనం లేని పిల్లలు, వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందే తల్లిదండ్రుల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. కొన్ని రోజులుగా వరుసగా దేశంలోని ఒక్కో రాస్ట్రం 10,12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేప్తోన్న విషయం తెలిసిందే. అయితే కేరళ(Keala)లో కూడా ఇటీవల 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే 10వ తరగతిలో పాస్ అయ్యానన్న ఆనందంతో కేరళ బాలుడు ఊర్లో ప్లెక్సీలు(Flex)పెట్టించాడు. ఈ పోస్టర్‌ ఫొటోను కేరళ విద్యాశాఖ మంత్రి స్వయంగా ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఇప్పుడిది వైరల్(Viral)గా మారింది.

కేరళకు చెందిన జిస్ఫు ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాశాడు. అయితే పరీక్షలు రాయకముందునుంచు నువ్వు సక్కగా చదవవు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అంటూ అతడిని చుట్టూ ఉన్నవాళ్లు వెక్కిరించేవాళ్లు. అతని స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులు కూడా అతను విఫలమవుతాడని ఖచ్చితంగా అనుకున్నారు. జిష్ణు ఫెయిల్యూర్ గురించి అందరూ చాలా ఎగతాళి చేసేవారు. దీంతో పరీక్ష ఫలితాల గురించి జిష్ణు భయపడ్డారు. వెక్కిరింతలు అతనికి చాలా బాధ కలిగించాయి. అయితే రీసెంట్ గా రిజల్ట్ రాగానే జిష్ణు పరీక్షలో పాసయ్యాడు. దీంతో తన ఘనతను అందరికీ చెప్పాలని అనుకున్నాడు.

Plastic Ban : ప్లాస్టిక్ పై నిషేధం..జలై 1 నుంచి ప్లాస్టిక్ వాడితే భారీగా జరిమానా

తన రిజల్ట్‌ గురించి అవహేళన చేసేవాళ్లందరి ముఖం మీద చెంపదెబ్బ కొట్టేలా తన రిజల్ట్ ఫ్లెక్స్‌ని ప్రింట్ చేశాడు. తమ ఊర్లో ఈ ప్లెక్సీలు ఏర్పాటు చేశాడు.కొందరికి చరిత్ర దారి చూపుతుంది,గే SSLC పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు నన్ను నేను అభినందిస్తున్నాను అనే క్యాప్షన్ తో ఆ ప్లెక్సీ కనిపిస్తోంది.పోస్టర్‌లో జిష్ణు కళ్లజోడుతో ఉన్న చిత్రం కూడా ఉంది. ఈ పోస్టర్‌ను కేరళ విద్యాశాఖ మంత్రి స్వయంగా చూశారు. ఆ పోస్టర్‌ను ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. తన పోస్ట్‌లో జిష్ణు మరింతగా విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

First published:

Tags: Kerala, Viral photo

ఉత్తమ కథలు