కర్నూలు జిల్లాలో మోదీని తిడితే.. ఉద్యోగం ఊడింది

ప్రధాని నరేంద్ర మోదీ మీద అసభ్యకర వ్యాఖ్యలు పోస్ట్ చేసిన టీచర్ తన ఉద్యోగం పోగొట్టుకున్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 5:58 PM IST
కర్నూలు జిల్లాలో మోదీని తిడితే.. ఉద్యోగం ఊడింది
నరేంద్ర మోదీ (File)
  • Share this:
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ కేరళ వాసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కేరళకు చెందిన శిజు జయరాజ్ కర్నూలు జిల్లాలోని ఓ స్కూల్లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ఇటీవల తన ఫేస్ బుక్ పేజ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద అసభ్యకర వ్యాఖ్యలతో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో వైరల్‌గా మారింది. బీజేపీ కార్యకర్తలు, మోదీ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీనిపై కేరళలో బీజేవైఎం కార్యకర్తలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారంటూ శిజు జయరాజ్ తన ఫేస్ బుక్ పేజీలో వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత తన తప్పుకి క్షమించాలంటూ మరోసారి పోస్ట్ చేశాడు. తనకు ప్రధాని మోదీ అంటే గౌరవం ఉందని, తాను చేసిన ఒక తప్పును మన్నించాలని కోరాడు. అయితే, అప్పటికే ఉద్యోగం ఊడిపోయింది. శిజు జయరాజ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.


కర్నూలు జిల్లాలోని చక్రంపేటలో ఉన్న ఓ స్కూల్లో శిజు జయరాజ్ పనిచేస్తున్నాడు. అయితే, అతడు చేసిన పోస్ట్ వల్ల స్కూల్ పేరు కూడా పోతుందన్న ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం రెండు రోజుల క్రితం వివరణ ఇచ్చింది. శిజు జయరాజ్ వ్యక్తిగత పోస్ట్‌తో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. తాజాగా, అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 18, 2019, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading