వైరల్ వీడియో... స్టేజీపై పాడుతూ... కుప్పకూలి చనిపోయిన ఎస్సై...

Kerala Cop : అప్పటిదాకా సంతోషంగా జరుగుతున్న కూతురి పెళ్లి వేడుక... ఒక్కసారిగా విషాదం అయ్యింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 8:47 AM IST
వైరల్ వీడియో... స్టేజీపై పాడుతూ... కుప్పకూలి చనిపోయిన ఎస్సై...
విష్ణుప్రసాద్ (Image : Facebook)
  • Share this:
అంతా సెకండ్లలో జరిగిపోయింది. కేరళ... తిరువనంతపురంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు విష్ణుప్రసాద్. చిన్న కూతురి పెళ్లి వేడుక కోసం ఇంటిని గ్రాండ్‌గా డెకరేట్ చేశారు. ఆ సంతోషంలో స్టేజీపై పాటపాడాడు 55 ఏళ్ల విష్ణుప్రసాద్. ఆయన పాడుతుంటే... అందరూ అది వింటూ... సింగర్ కాకపోయినా, బాగానే పాడుతున్నాడు అనుకోసాగారు. షాకేంటంటే... అలా పాడుతూ పాడుతూనే ఆయన పక్కకు పడిపోయాడు. అదేంటి అలా పడిపోయాడు అని అంతా దగ్గరకు వెళ్లి చూశారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన చనిపోయాడు. కేరళలో కూతుళ్ల పెళ్లికి తండ్రులు పాటలు పాడే సంస్కృతి ఉంది. అందులో భాగంగా... రాకిలి పొన్మాగలే అనే సాంగ్ పాడతారు. ఆ పాట పాడుతూ ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఐతే... కూతురు ఆర్చా పెళ్లి జరిపించాలన్నది ఎస్సై చిరకాల కోరిక. అందువల్ల ఆయన మరణించిన విషయం కూతురికి చెప్పలేదు కుటుంబ సభ్యులు. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని అబద్ధం చెప్పారు. లోపల ఎంతో బాధను దాచుకొని... పైకి నవ్వుతూ పెళ్లి వేడుక ముగించారు.

ఆర్చా పెళ్లిచేసుకున్న వరుడి పేరు కూడా విష్ణు ప్రసాదే. కొల్లంలోని దుర్గాదేవి టెంపుల్‌లో ఈ పెళ్లి జరిగింది. అత్తారింటికి ఆర్చాని సాగనంపుతూ కూడా అసలు నిజం చెప్పలేదు కుటుంబ సభ్యులు. అత్తారింటికి వెళ్లిన మర్నాడు... అంత్యక్రియలు చేయదలచినప్పుడు... కూతురికి కంబురు పంపారు. అసలు విషయం తెలిశాక... ఆర్చా గుండెల పగిలేలా ఏడ్చింది. తనకు ముందే తెలిస్తే, అసలు పెళ్లే చేసుకునేదాన్ని కాదని... కన్నీరు పెట్టింది. కుటుంబ సభ్యులు, బంధువులు, అత్తారింటివారూ అందరూ ఆమెను ఓదార్చేందుకు చాలా సమయం పట్టింది.

 ఇవి కూడా చదవండి :

తెలంగాణలో ఐదుగురు మంత్రులు ఔట్..? లోక్ సభ ఎన్నికల ఫలితం...జగన్ ప్రకటనతో టీడీపీలో మళ్లీ ఉత్సాహం... గుంటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

జూన్ 5 వరకూ తీవ్ర ఎండలే... RTGS హెచ్చరిక... బయటకు వెళ్లొద్దు...

జగన్ ప్రమాణ స్వీకారానికి జోరుగా ఏర్పాట్లు... 10 LED స్క్రీన్లు
First published: May 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు