Home /News /trending /

KERALA POLICE OFFICER HAS WON PRAISE ON SOCIAL MEDIA AFTER HIS TIMELY ACTION HELPED A NEET ASPIRANT REACH THE EXAMINATION CENTRE IN TIME SRD

Viral News : అమ్మాయికి ఈ పోలీస్ చేసిన సాయం ఏంటో తెలిస్తే సెల్యూట్ కొడతారు..

Image Credit : EXPRESS

Image Credit : EXPRESS

Viral News : చాలా మంది విద్యార్ధులకు నీట్ ఎగ్జామ్ ఎంతో ముఖ్యమైనది. ఈ పరీక్ష కోసం ఎంతోగానో కష్టపడి ప్రిపేరవుతారు. అలాంటి.. ఎగ్జామ్ రాసే సమయంలో ఓ అమ్మాయికి అనుకోని సమస్య ఎదురైంది. అప్పుడు దేవుడిలా ప్రత్యక్షమై ఆ అమ్మాయికి అండగా నిలిచాడు ఓ పోలీస్ అధికారి.

ఇంకా చదవండి ...
    పరీక్షా కేంద్రం ఒక చోట... హాల్‌ టికెట్‌లో పేర్కొన్న అడ్రస్‌ మాత్రం మరో చోట... దేశవ్యాప్తంగా ఆదివారం నీట్‌ పరీక్ష (Neet Exam) సందర్భంగా కొంతమంది విద్యార్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. హాల్‌ టికెట్‌లో ఉన్న అడ్రస్‌ ప్రకారం వెళ్లిన విద్యార్థులకు సెంటర్‌ దొరకలేదు. అడ్రస్‌ తప్పుగా ముద్రించారనే విషయం విద్యార్థులు తెలుసుకునేటప్పటికి సమయం మించిపోయింది. ఆలస్యంగా వచ్చారనే కారణంతో విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. నిర్వాహకులు చేసిన తప్పిదం వల్ల చాలా మంది నష్టపోయారు. కానీ, కేరళ (Kerala)లోని ఓ విద్యార్ధిని మాత్రం.. ఓ పోలీస్ వల్ల తప్పుడు అడ్రస్ కి వెళ్లిన చివరికి ఎగ్జామ్ రాసింది. ఆ స్టూడెండ్ కి సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సాయం చేసిన ఆ పోలీస్ అధికారి ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోగా మారాడు. దీంతో.. అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

    వివరాల్లోలోకి వెళ్లితే.. కేరళలోని కన్నమంగళం, చెట్టికులంగర నివాసి అర్చా దాస్ అలప్పుజా పట్టణంలోని SDV పాఠశాలకు చేరుకోవడానికి అంబలప్పుజ సబ్-ఇన్‌స్పెక్టర్ టోల్సన్ పి జోసెఫ్ మరియు డ్రైవర్ జోజి థామస్ సహాయం చేశారు. వాస్తవానికి అలప్పుజా టౌన్‌లోని అంబలప్పుజా తాలూకా కార్యాలయం సమీపంలో పాఠశాల ఉండగా అధికారులు హాల్ టిక్కెట్‌పై అంబలప్పుజ సమీపంలోని SDV ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ముద్రించారు.



    అర్చా తప్పు కేంద్రానికి చేరుకుందని గ్రహించిన తర్వాత.. టోల్సన్ అర్చాను అంబలప్పుళ నుండి అలప్పుజాకు తీసుకువెళ్లారు. పోలీసు జీప్‌తో 15 నిమిషాల్లో 10 కిలోమీటర్లు చేరుకుంది. దీంతో.. ఆమె పరీక్ష రాసింది. లేకపోతే.. ఆ విద్యార్ధిని నీట్ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయేది.

    “పాఠశాల చిరునామాలో అస్పష్టత కారణంగా చాలా మంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు బాధపడ్డారు. అర్చా మధ్యాహ్నం 12.50 గంటలకు పాఠశాలకు చేరుకుంది. ఆమె 1.20 గంటలకు హాలులోకి ప్రవేశించాల్సి ఉంది. స్కూల్‌లోకి ప్రవేశించిన తర్వాత హెల్పర్ రెజిత సంతోష్ చిరునామాను గమనించింది. అది తప్పని అర్చాకి తెలిపింది. అర్చా వెంటనే.. బయటకు వచ్చి ఆమె తండ్రి కోసం వెతికింది. కానీ ఆమె తండ్రి ఎక్కడా కనిపించలేదు. వెంటనే.. ఇది గమనించిన మేము ఆమెను మా జీపులో ఎక్కించుకుని, అలప్పుజా పట్టణంలోని SDV స్కూల్‌కి తీసుకువెళ్లాం”అని టోల్సన్ చెప్పారు.

    ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఇది.. తోపుడు బండి వ్యాపారికి AK47లతో ఇద్దరు బాడీగార్డ్స్​.. ఏడా సూడలే..

    ఇక.. విద్యార్ధిని అర్చా.. ఆమె తండ్రి ఎస్ఐ టోల్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో టోల్సన్ హెల్ప్ చేయకపోతే.. పరీక్ష రాసే అవకాశం కోల్పోయేదని ఆమె తండ్రి టోల్సన్ కి ధన్యావాదాలు తెలిపారు. ఇక, టోల్సన్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. అతన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Kerala, NEET, NEET 2022, Trending news, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు