Home /News /trending /

KERALA MOTHER WHO CLIMBED MOBILE TOWER IN SUICIDE ATTEMPT WAS SAVED BY A WASP SWARM ATTACK PAH

OMG: సూసైడ్ కోసం సెల్ టవర్ ఎక్కిన మహిళ.. రంగంలోకి దిగిన తేనెటీగలు.. ట్విస్ట్ మాములుగా లేదుగా..

సెల్ టవర్ ఎక్కిన మహిళ

సెల్ టవర్ ఎక్కిన మహిళ

Kerala: దంపతుల మధ్య గొడవలు జరిగాయి. భర్త తన బిడ్డను తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతని భార్య.. అతని ఇంటి దగ్గరకు వెళ్లి నానా రచ్చ చేసింది.

కొందరు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు పరీక్షలో పాస్ కాలేదని ఆత్మహత్యలకు (suicide)  పాల్పడుతున్నారు. మరికొందరు సరైన ఉద్యోగం రాలేదని, ఇంట్లో వారు తిట్టారని సూసైడ్ చేసుకుంటున్నారు. కొందరైతే లవ్ లో (Love failure) ఫెయిలయ్యామని, తనను తక్కువగా చేసి మాట్లాడుతున్నారంటూ.. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని తమ జీవితాలనునాశనం చేసుకుంటున్నారు. సాధారణంగా పెళ్లయ్యాక ఆలు మగల మధ్య గొడవలు కామన్ .. కొందరు దీనికి కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆస్తి తగ్గలేదని, ప్రియురాలు దూరంపెడుతుందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరైతే సిల్లి రిజన్స్ లకు కూడా పెద్దవిగా ఆలోచించి సూసైడ్ కు పాల్పడున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కేరళలోని (Kerala)  అలప్పుజ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కాయంకులంలో ఇద్దరు భార్య భర్తలు ఉంటున్నారు. కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య మనస్పర్థలు (Family disputes)  చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. దీంతో విసిగిపోయిన భర్త.. తన బిడ్డను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు అతని భార్య తీవ్ర మనస్తాపానికి లోనైంది. తన బిడ్డను ఇవ్వాలని ప్రాధేయ పడింది. వెంటనే భర్త ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చింది.

ఎంత చెప్పిన భర్త ఆమెను ఇంటికి రానివ్వలేదు. దీంతో ఆమె అక్కడే ఉన్న సెల్ టవర్ (Cell tower) ఎక్కింది. తన బిడ్డను ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ బెదిరించింది. ఆ తర్వాత.. అందరు చూస్తుండగానే సెల్ టవర్ ఎక్కింది. దీంతో స్థానికులు భయపడిపోయారు. మహిళను కిందకు దిగి రావాలని కోరారు. మహిళ ఎవరు చెప్పిన వినలేదు. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ముందు జాగ్రత్తగా సెల్ టవర్ కింద మెత్తని పరుపులను, చీరలతో వల మాదిరిగా కట్టి ఉంచారు.

మహిళ అలాగే పైకి ఎక్కింది. అప్పుడు ఒక ఊహించని సంఘటన జరిగింది. సెల్ టవర్ పైన.. కొన్ని తేనెటీగలు గుత్తిలాగా ఉన్నాయి. మహిళ సెల్ టవర్ (cell tower)  ఎక్కుతుండగా.. అది కాస్త.. ఊగింది. వెంటనే తేనెటీగల్ ఒక్కసారిగా లేచాయి. మహిళపై దాడి చేశాయి. ఆమెను కుట్టసాగాయి (wasps swarmed). వెంటనే ఆమె భయంతో కిందకు దూకేసింది. ఆమె అదృష్టం బాగుండి చీరల మీద పడింది. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పోలీసులు ఆమెను స్టేషల్ కు తరలించారు. ఆమె భర్తను కూడా స్టేషన్ పిలిపించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Attack, Kerala

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు