KERALA MAN WINS OVER RS 30 CR IN BIG TICKET ABU DHABI GOES VIRAL PAH
OMG: అదృష్టం అంటే ఇతనిదే.. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతుంటే.. ఏకంగా కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి..
నిలబడిన వారిలో కుడివైపు నుంచి రెండో వ్యక్తి రతీష్ రేఘునాథన్
Big Ticket Abu Dhabi: కేరళకు చెందిన ఒక వ్యక్తికి కలలో కూడా ఊహించని సంఘటన జరిగింది. కొత్య ఉద్యోగం కోసం వెతుకుతున్న అతనికి.. అదృష్టం మరో రూపంలో ఇంటి తలుపు తట్టింది.
Kerala man wins over Rs 30 crores in Abu Dhabi: సాధారణంగా లక్ అనేది ఎప్పుడు ఏ రూపంలో కలిసోస్తుందో ఎవరు చెప్పలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కలిసోచ్చే సమయం వస్తే.. అన్ని మంచి సంఘటనలే జరుగుతాయి. ఏ పనిచేసిన వాటిలో విజయమే సాధిస్తారు. కొందరికి బిజినెస్ లో కలిసి వస్తే.. మరికొందరికి ఉద్యోగంలో కలిసి వస్తుంది. కొంత మంది... నిధులు దొరకడం వలన రాత్రికి రాత్రే ధనవంతులవుతారు. కొందరికి డబ్బు లేదా బంగారం ఏదో ఒక రూపంలో దొరుకు తుంది. దీంతో రాత్రికి రాత్రే వారి అదృష్టం మారిపోతుంది. మన పెద్ద వాళ్లు తరచుగా కొన్ని సామెతలు చెబుతుంటారు. మంచి సమయం వస్తే.. మట్టిని పట్టుకున్న బంగారం అవుతుందని. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా వెలుగులోనికి వచ్చింది.
కేరళ కు చెందిన రతీష్ రేఘునాథన్ అనే వ్యక్తి అబూదాబిలో ఒక కొరియన్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రొక్యూర్మెంట్ విభాగంలో పనిచేస్తున్నాడు. అక్కడ కొన్ని చోట్ల లక్కీ ల్యాటరీ నిర్వహిస్తుంటారు. ఇతను గత ఐదేళ్ల నుంచి లక్కీ ల్యాటరీ టికెట్ తీసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా అతనికి ల్యాటరీ తగల్లేదు. ప్రతి సారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే వాడు.
ఈ క్రమంలో.. గత నెల మార్చి 19 న తన సహోద్యోగులతో కలిసి లక్కీ ల్యాటరీ టికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతను కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. తాజాగా, గత ఆదివారం తీసిన లక్కీ డ్రా విజేతలలో ఇతని నంబర్ 291593 అక్షరాల 15 మిలియన్ దిర్హామ్ గ్రాండ్ ప్రైజ్ మనీని గెలుచుకుంది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు.. 30 కోట్లన్నమాట. ఇది విని మొదట రతీష్ రేఘునాథన్ నమ్మలేదు. తన స్నేహితులు అతని నంబర్ ను చెక్ చేసుకుని ఆ విషయాన్నితెలిపారు.
దీంతో రతీష్ షాకింగ్ లో ఉండిపోయాడు. ప్రస్తుతం రతీష్ కుటుంబం ఆనందంలో మునిగిపోయారు. ఈ డబ్బుతో కొత్త వ్యాపారం ప్రారంభిస్తామని తెలిపారు. అదే విధంగా తన పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని తెలిపాడు. దీనిపై రతీష్ మాట్లాడుతూ.. ఇప్పటికి నేను నమ్మలేక పోతున్నానని, దేవుడు, పెద్దల అనుగ్రహాంతో తనను అదృష్టం లక్కీ ల్యాటరీ రూపంలో కలిసోచ్చిందని తెలిపాడు. ఈ డబ్బుతో తిరిగి భారత దేశానికి వెళ్లిపోతానని తెలిపాడు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.