హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కొడుకు ప్రేమించి మోసం చేస్తే...తండ్రి కన్యాదానం చేసి ఆస్తి రాసిచ్చాడు..

కొడుకు ప్రేమించి మోసం చేస్తే...తండ్రి కన్యాదానం చేసి ఆస్తి రాసిచ్చాడు..

షాజి వివాహం

షాజి వివాహం

బాగా ఆలోచించిన షాజి..ఎలాగైనా యువతినికి న్యాయం చేయాలనుకున్నాడు. మంచి సంబంధం చూసి వేరొక అబ్బాయితో యువతికి పెళ్లిచేశాడు. అంతేకాదు తన ఆస్తినంతా ఆమె పేరున రాసి కుమారుడికి గట్టి గుణపాఠం చెప్పాడు.

    కొడుకు ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచాడు. పుట్టింటి వారు కూడా గెంటేయడంతో ఆ యువతి రోడ్డున పడింది. తన కుమారుడి వల్లే ఆమె జీవితం నాశనమైందని గ్రహించిన తండ్రి...సుపుత్రుడికి దిమ్మతిరిగే గుణపాఠం చెప్పాడు. బాధిత యువతికి కొత్త జీవితం ప్రసాదించాడు. తను కుమారుడు ప్రేమించి మోసం చేసిన యువతికి తండ్రిలా మారి కన్యాదానం చేశాడు. వేరొక అబ్బాయికిచ్చి ఘనంగా పెళ్లిచేశాడు. అంతేకాదు తన యావదాస్తిని ఆమె పేరున రాసిచ్చాడు.


    షాజి అనే వ్యక్తి కొటాయం (కేరళ) జిల్లాలోని తిరునక్కారలో నివసిస్తున్నాడు. ఆయన కుమారుడు ఆరేళ్ల కిందట ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఐతే అప్పడు వారిద్దరు మైనర్లు కావడంతో పెళ్లి ఆగిపోయింది. మేజర్లయ్యాక తానే పెళ్లి చేస్తానని షాజి వాగ్ధానం చేశాడు. చూస్తుండగానే ఆరేళ్లు గడిచిపోయాయి. ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడికి పెళ్లిచేసేందుకు షాజి సిద్ధమయ్యాడు. కానీ అప్పుడే ఆయన సుపుత్రుడు ఊహించని షాకిచ్చాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు.


    షాజి కొడుకు మరో యువతితో ప్రేమలో పడ్డాడు. తనతో పాటు కాలేజీలో చదివే ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని తేల్చిచెప్పాడు. మొదటి ప్రియురాలిని గెంటేసినంత పనిచేశాడు. దిక్కుతోచని స్థితిలో తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది యువతి. ఐతే ప్రియుడితో వెళ్లిపోయి సమాజంలో తమ పరువు తీసిందని భావించిన తల్లిదండ్రులు..కూతురును మెడపట్టి గెంటేశారు. ఈ పరిణామాలన్నీ షాజిని తీవ్రగా బాధించాయి. తన కొడుకు వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనమవుతోందని మదనపడ్డాడు.


    చివరి ప్రయత్నంగా తన కుమారుడిని, ఆ యువతిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఐనా ఫలితం లేదు. ఆమెను పెళ్లిచేసుకునే ప్రసక్తే లేదని అతడు స్పష్టంచేశాడు. దాంతో బాగా ఆలోచించిన షాజి..ఎలాగైనా యువతినికి న్యాయం చేయాలనుకున్నాడు. మంచి సంబంధం చూసి వేరొక అబ్బాయితో యువతికి పెళ్లిచేశాడు. తిరునక్కార మహాదేవ ఆలయంలో బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించాడు. అంతేకాదు తన ఆస్తినంతా ఆమె పేరున రాసి కుమారుడికి గట్టి గుణపాఠం చెప్పాడు షాజి.


    First published:

    Tags: Kerala, Love cheating, Marriage reception, Wedding

    ఉత్తమ కథలు