Home /News /trending /

KERALA MAN SHANAVAS PARALYSED FROM NECK DOWN HAS SET UP A MULTI CRORE TIMBER BUSINESS MKS

Kerala: మంచం దిగలేడు.. కానీ కోట్లు సంపాదిస్తున్నాడు -మెడ నుంచి కాళ్లు పని చేయకున్నా..

మంచం కదల్లేని షాజవాస్ కోట్లు సంపాదిస్తున్నాడు

మంచం కదల్లేని షాజవాస్ కోట్లు సంపాదిస్తున్నాడు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంచానికే పరిమితం అయినా.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు షాజవాస్. కేరళలోని కాసరగడ్ జిల్లాకు చెందిన ఈ 47 ఏళ్ల కలప వ్యాపారి.. కుటుంబం సహాయంతో సాదించిన సక్సెస్ స్టోరీ అందరికీ స్ఫూర్తినిస్తుంది..

సాధారణంగా ఏదైనా వ్యాపారం చేయడమే కష్టంతో కూడుకున్న పని. అందులోనూ వ్యాపారాన్ని లాభాల్లో నడిపించడం మరింత కష్టం. అయితే రోడ్డు ప్రమాదంతో మంచానికే పరిమితం అయినా.. కోట్ల రూపాయల విలువైన కలప వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు కేరళలోని కాసరగడ్ జిల్లాకు చెందిన 47 సంవత్సరాల వ్యాపారి. పూర్తిగా మంచానికే పరిమితమైనా సరే.. తన ఎడమ చెవికి ఎయిర్ పాడ్ తగిలించుకుని వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. టింబర్ డిపోల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇంతటి దృఢమైన సంకల్పం ఉన్న ఆ వ్యక్తి పేరు టీఏ షానవాస్. ఆయన స్వస్థలం కాసరగోడ్‌ జిల్లాలోని ఈస్ట్ ఎలేరి పరిధిలో ఉన్న కంబలోర్. ప్రస్తుతం కోట్ల రూపాయల విలువైన వ్యాపార కార్యకలాపాలను మంచంపై నుంచే పర్యవేక్షిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి..
వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్న సమయంలోనే షానవాస్ అనుకోకుండా ఓ ప్రమాదానికి గురయ్యారు. దీని గురించి ఆయన వివరిస్తూ.. ‘‘2010, మే 6వ తేదీ ఉదయం కలప కొనుగోలు చేయడానికి కరకాలకు వెళ్లాను. రెండు లారీల కలపతో సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యాను. నా మిత్రుడు నడుపుతున్న కారులో నేను ప్రయాణిస్తున్నాను. రెండు ట్రక్కుల కలప లారీలు మా వెనుకే వస్తున్నాయి. అప్పుడు మేము కేరళ సరిహద్దులు దాటాం. కునియ సమీపంలోని పెరియతడుకమ్ చేరుకునే సరికి చీకటి అయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. వాహనం రోడ్డు కిందకు వెళ్లిపోతుంటే నేను హెచ్చరించాను. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. కారు రెండు మూడు ఫల్టీలు కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను’’ అని షానవాస్ తెలిపారు.

కేరళ కలప వ్యాపారి షాజవాస్


నడవలేడని డాక్టర్లు చెప్పడంతో..
ప్రమాదంలో కారు నుంచి బయటపడ్డ షానవాస్ తల ఓ బండరాయికి కొట్టుకుంది. సహాయం చేయడానికి కూడా అక్కడ ఎవరూ లేకపోవడంతో కలప ట్రక్కులోనే కన్హంగాడ్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు రక్తం విపరీతంగా పోయింది. తలకు బలమైన గాయాలు అయ్యాయి. కన్హంగాడ్ ఆసుపత్రి వైద్యులు మంగళూరులోని యూనిటీ ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. స్పైనల్ కార్డ్ దెబ్బతినడంతో ఆపరేషన్ చేయడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారమని డాక్టర్లు సూచించారు. దీంతో నాలుగు నెలలపాటు ఐసీయూలో మంచానికే పరిమితం అయ్యారు షనవాస్. తరువాత మెరుగైన వైద్యం కోసం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (Christian Medical College)కి తరలించారు. సీఎంసీలో 13 గంటల సుదీర్ఘ ఆపరేషన్ చేసిన తర్వాత, అక్కడ 5 నెలలు ఉంచారు. తన మెడ భాగంలో స్టీల్ రాడ్ వేయడంతో మెడ కొంచెం కదిలించడానికి వీలవుతోందని చెబుతున్నారు షనవాస్.

అలా మలుపు తిరిగిన జీవితం..
సీఎంసీలో వైద్యం తన జీవితాన్ని మలుపు తిప్పిందంటారు షానవాస్. ‘‘ఈ ఆసుపత్రిలో అనేక మంది రోగులను చూశాను. కొందరు అపస్మారక స్థితిలో ఉన్నారు. తీవ్ర గాయాలైన వారిని చూశాను. ఈ విషయంలో నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. మంచి మెదడు, కనీసం నాకు మాట్లాడే అవకాశం అయినా నాకు ఉంది. నా జీవితంలో ఐసీయూలో ఉన్న సమయమే అత్యంత దయనీయమైనది. 9 నెలల తరువాత నా వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని ఆసుపత్రిలోనే నిర్ణయించుకున్నాను’’ అని షనవాస్ తెలిపారు.

నా భార్యనూ గదిలో అలా ఫొటోలు తీశారు -ఆత్మహత్య ఆగింది కూడా ఇందుకే -భువనేశ్వరి ఉదంతో భారీ కుదుపుభార్య రెహ్మత్ సహాయంతో..
అతని నిర్ణయాన్ని భార్య రెహ్మత్ అంగీకరించారు. ఆమె సహకారం లేకుండా ఈ విజయం సాధ్యం అయ్యేది కాదని షానవాస్ చెప్పారు. ‘‘వైద్యానికి భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో వ్యాపారం ప్రారంభించడానికి నా చేతిలో డబ్బు లేదు. నా భార్య తన ఆభరణాలను తనఖాపెట్టి డబ్బు ఇచ్చింది. దీంతో ఒక లారీ కలప కొని వ్యాపారం ప్రారంభించాను. దాన్ని వారంలో అమ్మేశాను. లాభాలు రావడంతో మరలా కలప కొని అమ్మడం ప్రారంభించాను. ఇలా వ్యాపారం గాడిలో పడింది’’ అని షనవాస్ చెప్పారు.

కేరల కలప వ్యాపారి షాజవాస్


కుటుంబ సభ్యుల సహకారం
ఇంటర్మీడియట్ చదువుతోన్న ఫాతిమా, ఆరో తరగతి చదువుతోన్న నిదా ఇద్దరు కూతుళ్లూ తన ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపడంతోపాటు, వ్యాపారంలోనూ సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు షనవాస్ ఆఫ్రికా, మలేషియా, మాల్దీవుల నుంచి కూడా కలప తెప్పిస్తున్నారు. కేరళలో భవన నిర్మాణాలకు అవసరమైన కలప విక్రయిస్తున్నట్టు షనవాస్ చెప్పుకొచ్చారు.

తొడగొట్టిన తెలంగాణ కాంగ్రెస్ : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రేవంత్ రెడ్డి సేన -నాలుగు జిల్లాల్లో అభ్యర్థులు వీరేఅనుకోకుండా వ్యాపారంలోకి..
షానవాస్ కలప వ్యాపారంలోకి రావడం విచిత్రంగా జరిగింది. డిగ్రీ పూర్తి చేశాక పరప్పాలో ఒక ఎలక్ట్రికల్ షాపు నడిపారు. అక్కడికి సమీపంలోనే ఆయన మేనమామ కలప వ్యాపారం చేసేవాడు. అతని ఆకస్మిక మరణంతో షనవాస్ కలప వ్యాపారంలోకి రావాల్సి వచ్చింది. అప్పుడు అతడి వయసు 31 సంవత్సరాలు. ఆ తరువాత వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగారు షనవాస్. ‘‘జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనం వాటిని స్వీకరించాలి. ఎదురొడ్డి పోరాడాలి. వ్యాపారం విజయవంతంగా కొనసాగించడంలో నా కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం ఎంతో ఉంది. నా జీవితం సంతోషంగా గడిచిపోతోంది. ప్రతి ఒక్కరు కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు’’ అని షానవాస్ చెబుతున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Businessman, Kerala, Success story

తదుపరి వార్తలు