KERALA MAN MOVED THE COURT AS COVAXIN IS NOT RECOGNISED IN SAUDI ARABIA AND HE WANTED THIRD JAB GH SSR
Vaccine Third Dose: కోవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు కావాలంటూ ఈయన హైకోర్టుకెక్కారు.. అసలు విషయం ఏంటంటే..
గిరికుమార్ టెక్కన్ కున్నుంపురాత్
కరోనా సమయంలో భారతదేశంలో చిక్కుకున్న వేలాది మంది ప్రవాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దేశీయ టీకాలు తీసుకున్న ప్రవాసులు విదేశీ ప్రయాణాలు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. గిరికుమార్ టెక్కన్ కున్నుంపురాత్ అనే కేరళ ప్రవాసుడు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాడు.
కరోనా సమయంలో భారతదేశంలో చిక్కుకున్న వేలాది మంది ప్రవాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దేశీయ టీకాలు తీసుకున్న ప్రవాసులు విదేశీ ప్రయాణాలు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. గిరికుమార్ టెక్కన్ కున్నుంపురాత్ అనే కేరళ ప్రవాసుడు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాడు. విదేశీ ప్రయాణాలకు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ను మాత్రమే తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. గతంలో ఈ విషయంపై అవగాహన లేక కోవాగ్జిన్ టీకా తీసుకున్నానని చెబుతున్నాడు. విదేశాలకు వెళ్లేందుకు వీలుగా అంతర్జాతీయంగా ఆమోదం పొందిన కోవిషీల్డ్ టీకాను మూడో డోసుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకు ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. కన్నూర్‌లోని శ్రీకాండపురానికి చెందిన గిరికుమార్(50) అనే వ్యక్తి.. గత ఎనిమిదేళ్లుగా సౌదీ అరేబియాలో వెల్డర్‌గా పనిచేశాడు. జనవరి నెలలో సౌదీఅరేబియాలో సెకండ్ వేవ్ విజృంభించగా.. గిరికుమార్ ఇండియాకి తిరిగి వచ్చాడు. ప్రభుత్వం 45 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించడంతో, తన పాస్‌పోర్ట్ వివరాలను ఉపయోగించి కొవిన్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యాడు. తొలి కొవాగ్జిన్ డోసును ఏప్రిల్ 17న తీసుకున్నాడు. ఒక నెల తరువాత రెండో డోసు కూడా తీసుకున్నాడు. అయితే కొవాగ్జిన్ తీసుకున్న ప్రజలను సౌదీ అరేబియాతో సహా పలు దేశాలు అనుమతించడం లేదని తెలుసుకుని గిరికుమార్ షాక్ అయ్యాడు. కొవాగ్జిన్ కరోనా టీకా అంతర్జాతీయంగా గుర్తింపు పొందలేదని అధికారులు చెప్తే.. తాను దాన్ని తీసుకోకుండా ఆగిపోయేవాడినని ఆవేదన వ్యక్తం చేశాడు.
భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాను సౌదీ అరేబియా అధికారికంగా గుర్తించిందని గిరికుమార్ చెబుతున్నాడు. సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో తన ఉద్యోగాన్ని తిరిగి పొందాలంటే త్వరగా కొవిషీల్డ్ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. మూడోసారి టీకా తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వీసా నిబంధన ప్రకారం ఆగస్టు 30 నాటికి సౌదీ అరేబియాకు తిరిగి వెళ్లాలని లేదా ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని.. వారి విద్యా ఖర్చులను భరించడానికి తనకు వేరే ఆదాయ వనరు లేదని వాపోయాడు.
కానీ కోవిన్ వెబ్సైట్లో థర్డ్ డోస్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఏ ఆప్షన్ అందుబాటులో లేదు. దీంతో గిరికుమార్ మూడవ డోసు తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. దీంతో గిరికుమార్ తనకు కొవిషీల్డ్ టీకా కావాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ఆగస్టు 9కి వాయిదా పడిందని ఆయన తరఫు న్యాయవాది మానస్ పీ. హమీద్ తెలిపారు. ఈ విషయంపై హైకోర్టు కేంద్రం అభిప్రాయాన్ని కోరిందని హమీద్ వెల్లడించారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.