హత్యలు పెరిగిపోతున్నాయి.. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేదు.. దేశం నలుమూలల నిత్యం హత్యలే.. కొట్టుకోవడం.. తన్నుకోవడం.. చంపుకోవడం.. పారిపోవడం.. దొరికిపోవడం.. రోజూ ఇదే తరహా ఘటనలు..! కారణమేదైనా.. చంపుకోవడం మాత్రం కామన్‌గా మారిపోతున్న రోజులివి.. చట్టం నుంచి తప్పించుకోలేని తెలిసినా బరితెగించి ప్రవర్తిస్తున్న కాలమిది.. ఇంత హింస ఎందుకో అర్థం కాని పరిస్థితి.. మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన సమస్యలకు కూడా కత్తులు, గన్‌లు ఉపయోగిస్తున్నారు.. అవేమీ లేకపోతే కాళ్లు, చేతులకు పని చెబుతున్నారు.. తాజాగా కేరళ(Kerala)లో జరిగిన ఓ బస్సు డ్రైవర్(bus driver) హత్య ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది..
అతడికి పెళ్లి కాలేదు.. ఆమెకు అయ్యింది:
కేరళలోని త్రిసూరు(Thrissur)లో 33ఏళ్ల సహర్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.. అతనకు పెళ్లియిన ఓ అమ్మాయితో పరిచయముంది.. మరి ఏమైందో తెలియదు కానీ.. అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు.. ఇంటి బయటకు రాగానే.. 'ఎవరు నువ్వు, లోపలి నుంచి ఎందుకు వస్తున్నావు, ఈ సమయంలో ఇక్కడేంటి నీకు పని అని' ఒక అతను ప్రశ్నించాడు. అతను సమాధానం చెబుతుండగానే.. మరికొంతమంది అక్కడకి చేరి సహర్‌ను చుట్టుముట్టారు.. ఒకరి తర్వాత ఒకరు కొట్టడం స్టార్ట్ చేశారు. సహర్ బతిమాలాడుతున్నా ఏ మాత్రం కనికరించలేదు.. కాళ్లతో ఇష్టం వచ్చినట్లు, పిచ్చి పిచ్చిగా.. ఎక్కడ పడితే అక్కడ తన్నడం మొదలుపెట్టారు.. ఇంతలోనే సహర్ స్పృహ కోల్పోయాడు.. గమనించిన దుండగులు.. అక్కడ నుంచి పరారయ్యారు.
వివాహిత ఇంటి సమీపంలోని గుడిదగ్గర మోరల్ పోలీసింగ్ పేరుతో దుండగులు దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిజంగానే పోలీసులని సహర్ నమ్మినట్లు సమాచారం. ఈ షాకింగ్ సంఘటన సీసీటీవీలో రికార్డయింది. గత నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
#Trissur Brutal Attack #Shocking pic.twitter.com/pjrH1n706x
— News18 Telugu (@News18Telugu) March 8, 2023
గాయాలతో ఇంటికి వెళ్లిన సహర్.. తర్వాత మృతి:
కొట్టిన తర్వాత కాసేపటికి స్పృహలోకి వచ్చిన సహర్.. గాయాలతో ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం విపరీతమైన నొప్పి రావడంతో సహర్‌ను ఆస్పత్రికి తరలించారు.. వారం రోజుల్లో సహర్ ఆరోగ్యం క్షీణించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై సహర్‌కు చికిత్స అందించారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. కిడ్నీలు, పక్కటెముకలకు తీవ్ర గాయాలు కావడంతో సహర్ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.. మరోవైపు కొట్టిన వ్యక్తులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సహర్ బంధువులు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.