కేరళలో కొత్త రూల్... ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వాలంటే... మామిడి లేదా పనస మొక్కలు పెంచాల్సిందే...

Kerala News : ఒకప్పుడు పచ్చగా కళకళలాడే భూమి... ఇప్పుడు ఎండిపోతోంది. కాంక్రీట్ జంగల్స్ ఎక్కువైపోయాయి. అందుకే కేరళ ప్రభుత్వం కొత్త రూల్ తెచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 10:03 AM IST
కేరళలో కొత్త రూల్... ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వాలంటే... మామిడి లేదా పనస మొక్కలు పెంచాల్సిందే...
ప్రతీకాత్మక చిత్రం (Image : Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 10:03 AM IST
పర్యావరణం పచ్చగా ఉన్నప్పుడే మనం హాయిగా జీవించగలం. భూమిపై చెట్లు తగ్గిపోతే... మనకు కష్టాలు తప్పవు. వేడి ఎక్కుపై నరకం చూస్తాం. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను చూస్తూనే ఉన్నాం. తీవ్ర ఎండల్ని భరిస్తున్నాం. దీనికి పరిష్కారం ఒక్కటే. మొక్కలు పెంచటం. కాలుష్యాన్ని తగ్గించుకుంటూ, మొక్కల్ని పెంచుకుంటూ పోతే... మన ప్రపంచం అత్యంత అద్భుతంగా మారిపోతుంది. ఇదంతా మనందరం చిన్నప్పుడు చదువుకున్నదే. కానీ మనలో ఎంత మంది మొక్కల్ని పెంచుతున్నారు. ఇలా ఆలోచించిన కేరళలోని కొండంగల్లూర్ పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రూల్ తెచ్చింది. ప్రతీ ఇంటి కాంపౌండ్‌లో మొక్కలు ఉండాలని డిసైడైంది. ఇకపై ఎవరైనా ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే... తప్పని సరిగా మొక్కలు పెంచాలనే రూల్ తెచ్చింది.

ఎవరైనా ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే... ఇంటి నిర్మాణానికి ముందు రెండు మామిడి మొక్కలు లేదా రెండు పనస మొక్కలను కాంపౌండ్‌లో పెంచాలి. ఇంటి నిర్మాణం పూర్తయ్యేసరికి... మొక్కలు కాస్తా చెట్లవుతాయి. అప్పుడు రిజిస్ట్రేషన్‌కి అప్లై చేసుకోవాలి. ప్రత్యేక అధికారుల బృందం ఆ ఇంటికి వచ్చి, మొక్కల్ని పరిశీలించి, అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంది.

1500 చదరపు అడుగుల నుంచీ 8 సెంట్లలో ఇల్లు నిర్మించుకునే అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది. ఇలాంటి కండీషన్ తెచ్చిన తొలి పట్టణం కొడంగల్లూరే అంటున్నారు స్థానికులు. వేగంగా కాంక్రీట్ జంగళ్లుగా మారిపోతున్న మెట్రో నగరాలు... కొడంగల్లూర్ నుంచీ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటున్నారు.

 ఇవి కూడా చదవండి :

బ్రెజిల్ నట్స్ తింటే... రుచికి రుచి... 20 రకాల ఆరోగ్య ప్రయోజనాలు...

Top 10 on Instagram : ఇన్‌స్టాగ్రాంలో టాప్ టెన్ అకౌంట్స్ ఇవే...

Loading...
సమ్మర్‌లో బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా... ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...

కొత్తిమీర పుదీనా జ్యూస్... వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

 
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...