Home /News /trending /

KERALA ELEPHANT STRANDED IN MIDDLE OF KERALA RIVER FOR SEVERAL HOURS PAH

భారీ ప్రవాహంలో చిక్కుకున్న గజరాజు.. తర్వాత ఏంజరిగిందంటే.. షాకింగ్ వీడియో వైరల్..

నదిలో చిక్కుకున్న ఏనుగు

నదిలో చిక్కుకున్న ఏనుగు

Kerala: ఏనుగు భారీగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహంలో చిక్కుకుంది. ముందుకు వెళ్ల లేక, వెనుకవైపు రాలేక అలాగే నదిలో మధ్య భాగంలో నిల్చుండి పోయింది.

కొన్నిరోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. నదులు, చెరువులు, ప్రాజెక్ట్ లలో భారీగా నీరు వచ్చి చేరుతుంది. సామాన్య జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. మనుషులతో పాటు.. అడవికి సమీపంలోని ఉండే జంతువులు కూడా జల ప్రవాహానికి విలవిల్లాడిపోతున్నాయి. మనుషులతో పాటు జంతువులు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాయి. తాజాగా, భారీ ఏనుగు నీటి ప్రవాహంలో చిక్కుకున్న వీడియో నెట్టింట వైరల్ గా (viral video) మారింది.

పూర్తి వివరాలు.. కేరళలో (Kerala) షాకింగ్ ఘటన జరిగింది. త్రిస్సూర్ జిల్లాలోని అటవీకి సమీపంలో ఉన్న ప్రాంతంలో గత మంగళవారం ఈ ఘటన జరిగింది. కాగా, కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి (Heavy rain) చలకుడి నది పొంగిపోర్లు తుంది. నది మధ్యలో ఒక ఏనుగు చిక్కుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో... ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకుని రెస్క్యూ చేపట్టారు.

ఏనుగు (Elephant) రాత్రి సమయంలో అడవి దాటడానికి ప్రయత్నించి.. నీళ్లలో ఇరుక్కుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఏనుగు.. కొంత దూరం నీటి ప్రవాహంలో కొన్ని మీటర్లు దూరం కొట్టుకుపోయింది. ఆ తర్వాత.. అక్కడ కాస్త ఒడ్డులాగ ఉండటంతో.. దాన్ని ఆధారం చేసుకొని తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే.. నీటి ప్రవాహాన్ని, లోతును గుర్తించడానికి ఏనుగు ఎప్పటికప్పుడు, తన తుండాన్ని నీటిలో ముంచడాన్ని స్థానికులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా వెకెషన్ కు వెళ్లిన యువతి తన సూట్ కేస్ లో తెచ్చిన దాన్ని చూసి ఇంట్లో వారు షాక్ కు గురయ్యారు.

ఆస్ట్రియాలోని (Astria) నాటర్న్ బాచ్ కు చెందిన లింజ్ అనే మహిళ తన సెలవుల్లో క్రయోషియాకు వెళ్లింది. ఆమె అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటించింది. అయితే.. ఆమె తన టూర్ ముగించుకుని ఇంటికి చేరుకుంది. అయితే.. ఆమె సూట్ కేసులో కొన్ని తేళ్లను తనతోపాటు ఇంటికి తీసుకెళ్లింది. దీన్ని చూసిన ఇంటిలోని వారు షాక్ కు గురయ్యారు. ఇదేంది అంటూ ఆమెపై మండిపడ్డారు.

వెంటనే ఆమె స్థానికంగా ఉండే ఒక రెస్క్యూ టీమ్ కు తేళ్లను ( scorpions) అప్పగించింది. ఆ తర్వాత.. వారు క్రయోషియా అడవుల్లో వదిలేస్తామంటూ తెలిపారు. కాగా, దాదాపు 2,000 రకాల తేళ్లు ఉన్నాయి. వాటిలో కేవలం 30 నుండి 40 జాతులు మాత్రమే మానవులలో మరణానికి కారణమయ్యేంత బలమైన విషాన్ని కలిగి ఉంటాయి. క్రొయేషియా నుంచి తెచ్చిన స్కార్పియన్స్ ప్రాణాపాయం కాదు. అయినప్పటికీ, వారి కుట్టడం వల్ల చర్మంపై నొప్పి, వాపు మరియు చికాకు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Elephant, Kerala, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు