హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వార్నీ.. బైక్ లో పెట్రోల్ తక్కువగా ఉందని ఫైన్ వేసిన ట్రాఫిక్ అధికారులు.. ఎక్కడంటే..

వార్నీ.. బైక్ లో పెట్రోల్ తక్కువగా ఉందని ఫైన్ వేసిన ట్రాఫిక్ అధికారులు.. ఎక్కడంటే..

బాసిల్ శ్యామ్ ఐటీ ఉద్యోగి

బాసిల్ శ్యామ్ ఐటీ ఉద్యోగి

Kerala: ఐటీ ఉద్యోగి తన రాయల్ ఎన్ ఫీల్డ్ మోటర్ బైక్ మీద ప్రయాణిస్తున్నాడు. అతను తన బైక్ లో సరిపడా పెట్రోల్ ఉంచుకోలేదు. తక్కువ పెట్రోల్ తోనే ప్రయాణిస్తున్నాడు.

కొందరు రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారు. సిగ్నల్ వద్ద ఆగకపోవడం, ట్రిబుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ పెట్టుకొక పోవడం వంటివి చేస్తుంటారు. మరికొందరు తాగి వెహికిల్ ను నడిపిస్తుంటారు. రాష్ గా, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తుంటారు. మరికొన్ని చోట్ల మైనర్ లు వాహనాలను నడిపిస్తుంటారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అలాంటి సందర్భాలలో పోలీసులు వాహనా దారులకు ఫైన్ లను విధిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం వినూత్నంగా బైక్ లో సరిపోయేంత పెట్రోల్ లేదని, ట్రాఫిక్ పోలీసులు జరిమాన వేశారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా (viral news)  మారింది.

పూర్తి వివరాలు.. ఈ ఘటన కేరళలో (Kerala)  వెలుగులోనికి వచ్చింది. బాసిల్ శ్యామ్ అనే ఐటీ ఉద్యోగి తన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ మీద కొచ్చిలోని పుక్కట్టు నుంచి తన ఆఫీస్ కు వెళ్తున్నాడు. అక్కడ వన్ వే మాత్రమే ఉంది. అప్పుడు ఒక ట్రాఫిక్ అధికారి 250 రూపాయల చలాన్ (Traffic challan)  వేశాడు. అది కట్టేసి ఆఫీస్ కు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక.. అసలు దేనికోసం వేశారో ఒకసారి చూసుకున్నాడు. బైక్ లో సరిపడా పెట్రోల్ లేదంటూ అతనికి, ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. దీన్ని చూసి అతను నవ్వుకున్నాడు. ఆ తర్వాత.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ ఘటన జులై 22 న జరిగింది. అయితే, కేరళలో మాత్రమే.. అధికారులు.. ఆటోలు,కార్లు వంటి ట్రాన్స్ పోర్ట్ వాహనాలు సరిపడా ఇంధనం ఉంచుకోవాలని నిబంధనలు పాటిస్తారు. అవి లేకుంటే ఫైన్ లు వేస్తారు. ఈ నిబంధనలు బైక్ లకు వర్తించదు. అతను చేసిన తప్పుకు కాకుండా.. బైక్ లో పెట్రోల్ లేదని ఫైన్ వేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.

తమ టీచర్ క్లాస్ కు రావడానికి విద్యార్థులు చేసిన పని వైరల్ గా మారింది.

ఉత్తర ప్రదేశ్ లోని  (Uttar pradesh) మధుర జిల్లాలో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. స్థానికంగా ఉన్న పాఠశాలలో వరద నీరు భారీగా వచ్చి చేరింది. స్కూల్ ఆవరణలో భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో.. టీచర్ తమ స్కూల్ లోపలికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడింది. అప్పుడు విద్యార్థులంతా ఒక ఐడియా వేశారు.

క్లాస్ కు వెళ్లి అక్కడ ఉన్న ప్లాస్టిక్ చేయిర్ లను తీసుకొచ్చారు. వాటిని విద్యార్థులంతా కలసి వరుసగా పెట్టారు. దానిపైన ఎక్కి టీచర్ ను క్లాస్ కు రమ్మన్నారు. అప్పుడు టీచర్ కుర్చీ మీద ఎక్కి ఒక్కొ.. కుర్చీ దాటుకుంటూ తరగతి గదికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్.. విద్యార్థుల ఐడియా భలే ఉందంటూ కామెంట్ లు పెడుతున్నారు

First published:

Tags: Kerala, Royal Enfield, Traffic challan, VIRAL NEWS

ఉత్తమ కథలు