Home /News /trending /

KERALA DISTRICT COLLECTOR DIVYA S IYER DANCES TO NAGADA SANG DHOL AS SHE JOINS STUDENTS IN FLASH MOB PAH

Viral Video: విద్యార్థినులతో కలిసి రచ్చ చేస్తున్న కలెక్టర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

డ్యాన్స్ చేస్తున్న కలెక్టర్

డ్యాన్స్ చేస్తున్న కలెక్టర్

Kerala District Collector: సాధారణంగా కొంత మంది అధికారులు చాలా గంభీరంగా ఉంటారు. వారితో మాట్లాడటానికి దిగువస్థాయి అధికారులు, ప్రజలు భయపడతారు. కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. కింది స్థాయి సిబ్బందితో ఇట్టే కలిసి పోతారు. స్థానికంగా జరిగే కార్యక్రమాలల్లో ఫుల్ జోష్ గా పాల్గోంటారు.  

ఇంకా చదవండి ...
Divya S Iyer Dances to Nagada Sang Dhol: కొంత మంది ఉన్నతోద్యోగులు చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు. వారు.. పని విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. వారు.. ఆఫీస్ లో ఉన్నారంటే.. ఎవరు మాట్లాడటానికి కూడా సాహాసించరు. ఇక కొందరు మాత్రం వీరికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. తోటి అధికారులతో, ప్రజలతో ఇట్టే కలిసి పోతుంటారు. ఆఫీస్ లో జరిగే కార్యక్రమాలలో సహాచర ఉద్యోగుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ఇక పబ్లిక్ కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆయా లోకల్ కార్యక్రమాల్లో పాల్గోని ఉద్యోగులను, ప్రజలను ఉత్సాహా పరుస్తారు. వీరు ప్రజలతో మమేకమై వారి సాదక బాధలను తెలుసుకుంటారు. ప్రజలు కూడా అలాంటి అధికారికి తాము.. ఎదుర్కొంటున్న సమస్యలను చెబుతారు. దీంతో కలెక్టర్ వారికి ఉపయోగరమైన పనులు చేసిపెడతారు. అలాంటి వారే ప్రజల మనస్సులో ఎప్పటికి నిలిచిపోతారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం కేరళలో చోటు చేసుకుంది.



పూర్తి వివరాలు.. కేరళ లో ఒక కలెక్టర్ ను స్థానిక  యూనివర్సీటి లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పతనం తిట్టా జిల్లాకు చెందిన కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ను మహాత్మాగాంధీ యూనివర్సీటీ కళాశాల యాజమాన్యం, కాలేజీలోని ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. దీంతో కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు. కార్య క్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా వీరు డ్యాన్స్ చేశారు. డీజే ల హోరు, విద్యార్థుల అరుపులు, కేకల మధ్య కార్య క్రమం ఫుల్ జోష్ తో నడుస్తోంది.

కలెక్టర్ కూడా తన చప్పట్లతో విద్యార్థులను ప్రొత్సహిస్తున్నారు. అప్పుడు.. రణబీర్ సింగ్, దీపిక పదుకొణే నటినటులుగా చేసిన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా చిత్రంలోని ఢోల్ బాజే... పాటకు విద్యార్థినులు గుంపులుగా డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు ఫన్నీ సన్నివేశం జరిగింది. విద్యార్థినులు ... వెళ్లి దీనిలో డాన్స్ చేయాల్సిందిగా కలెక్టర్ ను రమ్మని పిలిచారు. అప్పుడు.. కలెక్టర్ కూడా వెంటనే విద్యార్థినులతో కలసి గ్రౌండ్ కు చేరుకున్నారు. వారితో కలిసి.. స్టెప్పులు వేశారు. వారిని మరింత ఉత్సాహాపరిచారు. స్టూడెంట్స్ తో పోటా పోటీగా స్టెప్పులు వేస్తు వేడుకకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Collector, Kerala, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు