Home /News /trending /

KERALA CULTURAL AFFAIRS MINISTER SAJI CHERIAN RESIGNS PAH

Saji Cherian: రాజీనామా చేసిన సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్‌... కారణం అదే..

మంత్రి సాజీ చెరియన్‌ (ఫైల్)

మంత్రి సాజీ చెరియన్‌ (ఫైల్)

Kerala: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా మంత్రి సాజీ చెరియన్‌ కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయాంగా తీవ్ర దుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో కేరళ (Kerala) అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. అలాగే ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. వెంటనే సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చెరియన్‌ ను ( Saji Cherian) మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి సాజీ చెరియన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కార్యాలయంలో విలేకరులతో సమావేశమైన చెరియన్‌ రాజీనామాను సీఎంకు అందజేసినట్లు ప్రకటించారు. అయితే, తాను.. రాజీనామా తన (resigns) స్వతంత్ర నిర్ణయమని చెరియన్ అన్నారు. తనకు రాజ్యాంగం అంటే అత్యంత గౌరవమని అన్నారు. తనకు రాజ్యాంగాన్ని అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని చెరియన్‌ అన్నారు. ప్రస్తుతం ఈ సంఘటన కేరళ నాట తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది.



ఇదిలా ఉండగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ (Mukhtar Abbas Naqvi) తన పదవికి రాజీనామా చేశారు.

ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఐతే రేపటితో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పదవీ కాలం ముగుస్తుంది. ఆయన మళ్లీ రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేయలేదు. ఈ క్రమంలోనే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.  ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో పాటు మరో కేంద్రమంత్రి ఆర్సీపీ సింగ్ (RCP Singh) కూడా రాజీనామాను ప్రకటించారు. పదవీ కాలం ముగియడంతో వీరిద్దరు తమ పదవులను రాజీనామా చేసినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇన్నాళ్లు దేశానికి, ప్రజలకు చేసిన సేవకు గాను.. వారిని అభినందించారు.

ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చాలా సీనియర్ నేత. చాలా ఏళ్ల పాటు కేంద్రమంత్రిగా పనిచేశారు. రాజ్యసభలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. అలాంటి నేతను బీజేపీ మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు. కానీ బీజేపీ అలా చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే రాజ్యసభకు పంపలేదన్న ప్రచారం జరుగుతోంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Kerala, Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు