Viral: మా ఫోటోలు... మా ఇష్టం..!! కేరళ కపుల్ Hot Photo shoot.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

పెళ్లి చేసుకునే వాళ్లు జీవితకాలం దాచుకునే వాటిలో ఫోటోలు ఒకటి. ఎంతకాలమైనా వాటిని చూసుకుని మురిసిపోతుంటారు దంపతులు. కానీ కేరళ కు చెందిన ఒక జంట వెడ్డింగ్ ఫోటో షూట్ ను అందరికంటే కాస్త వెరైటీగా.. ‘కొంచెం ఘాటు’గా జరుపుకుంది.

news18
Updated: October 20, 2020, 12:28 PM IST
Viral: మా ఫోటోలు... మా ఇష్టం..!! కేరళ కపుల్ Hot Photo shoot.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
  • News18
  • Last Updated: October 20, 2020, 12:28 PM IST
  • Share this:
మాయదారి రోగం కరోనా తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకునే జంటలకు ఇది ఒక బ్యాడ్ న్యూసే. పెళ్లికి ముందు కపుల్ ఇద్దరూ ఏదైనా ఫారెస్టుకో.. సరస్సు, చెరువు గట్ల వెంబడి వెళ్లి.. ఫోటో షూట్ చేసుకోవడం కొద్దికాలంగా వస్తున్న ట్రెండ్. కానీ కరోనా కారణంగా ఫోటో షూట్ లు బందయ్యాయి. కేరళలో లోనూ ఒక చోట గత నెల పెళ్లి చేసుకుంది. వరుడు కార్తికేయన్.. వధువు లక్ష్మి. పెళ్లికి ముందు ఫోటో షూట్ చేసుకోవాలనుకున్నా కానీ లాక్డౌన్ నిబందనల కారణంగా ఆ జంట ఫోటో షూట్ చేసుకోవాలనే ముచ్చట తీరలేదు. అయితే.. ప్రస్తుతం ఆ నిబంధనలేమి లేవు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్లొచ్చు. ఏదైనా చేయొచ్చు. దీంతో వారిరువురు కలిసి.. కేరళలోని ఇడుక్కి జిల్లా లో ఉన్న ఒక ఎస్టేట్ కు హనీమూన్ వెళ్లారు.

అక్కడే వారి వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేశారు. అనుకున్నదే తడువుగా.. కార్తీక్ ఫ్రెండ్ ఫోటో గ్రాఫర్ ను ఐడియా అడగ్గా అతడు.. తెల్లని రంగు వస్త్రం ఒకటే వారి ఒంటి మీద కనిపించేలా.. ఫోటోల్లో వేరే దుస్తులేవీ కనిపించకుండా షూట్ చేద్దామని అతడు ఐడియా ఇచ్చాడు. గత గురువారం ఈ ఫోటోలను షూట్ చేశారు. ఆ తర్వాత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

























ఇలా పోస్టు చేశారో లేదో నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు. ఫోటోలు దిగేపుడు బట్టలు వేసుకున్నారా..? లేదా..? అంటూ కామెంట్ చేశారు. నాలుగు గోడల మధ్య చేసుకోవాల్సిన దానిని ఇలా పబ్లిక్ ప్లాట్ ఫాంల లో పెట్టి రచ్చ చేస్తారా..? అని దుమ్మెత్తి పో్తున్నారు. అయితే అందరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదని ఆ జంట నిశ్చయించుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఈ క్రియేటివిటికి మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.

ఇవే ఫోటోలను ఫోటోగ్రాఫర్ అఖిల్ స్టూడియో.. వెడ్డింగ్ స్టోరీస్ పేరిట ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశారు. దీనికి కూడా నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు.
Published by: Srinivas Munigala
First published: October 20, 2020, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading