'ముద్దు' కోసం ఆ జంట పెదాలు కలుపుతున్నవేళ.. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే?

Kerala couple falls into river from boat on pre-wedding photoshoot : కేరళలోని పంబా నదిలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తిజిన్-శిల్ప అనే వధూవరులతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుండగా.. ఈ ఘటన జరిగిందంటూ సదరు ఫోటోగ్రాఫర్.. వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

news18-telugu
Updated: April 19, 2019, 5:26 PM IST
'ముద్దు' కోసం ఆ జంట పెదాలు కలుపుతున్నవేళ.. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే?
ప్రీ వెడ్డింగ్ షూట్ చిత్రీకరణలో (Image : Fcebook)
news18-telugu
Updated: April 19, 2019, 5:26 PM IST
ఒకప్పుడు పెళ్లి అంటే సాదాసీదా వీడియోగ్రఫీతో సరిపెట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా.. వెడ్డింగ్ వీడియోలను ప్లాన్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లికి ముందు సినిమాటిక్ తరహాలో ప్రీ-వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు. సినిమాల్లో హీరో హీరోయిన్ల లాగే ప్రీ-వెడ్డింగ్ షూట్స్‌లో ఆడి పాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కేరళ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్‌గా మారింది. షూటింగ్ సమయంలో వధూవరులతో పడవలో 'ముద్దు' సీన్ చిత్రీకరిస్తుండగా.. అది కాస్త ఓ పక్కకు ఒరిగి ఇద్దరూ నీళ్లలో పడిపోయారు.

కేరళలోని పంబా నదిలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తిజిన్-శిల్ప అనే వధూవరులతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుండగా.. ఈ ఘటన జరిగిందంటూ సదరు ఫోటోగ్రాఫర్.. వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. నిజానికి ఆ జంటతో ముద్దు సీన్ చిత్రీకరించాలన్న ఆలోచన అప్పటికప్పుడే వచ్చిందని.. ఆ విషయం ముందుగా వారికి కూడా చెప్పలేదని అతను తెలిపాడు.

ముద్దు పెట్టుకోవడానికి ఇద్దరు పెదాలు కలుపుతున్నవేళ.. అకస్మాత్తుగా పడవ ఒరిగి నీళ్లలో పడిపోవడంపై నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద పర్ఫెక్షన్ కోసం ఫోటోగ్రాఫర్స్ ఏమైనా చేయిస్తారని మరోసారి రుజువైంది. గతంలో ఓ ఫోటోగ్రాఫర్ చెట్టుపై తలకిందులుగా వేలాడుతూ కొత్త జంటను ఫోటో తీసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు 'ముద్దు' సీన్ కోసం ఈ ఫోటోగ్రాఫర్ చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది.First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...