• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • KERALA BASED JEWELRY BRAND ADVERTISEMENT VIDEO GONE VIRAL ON SOCIAL MEDIA FULL DETAILS HERE PRN GH

Jewelry ad goes viral: మనసును హత్తుకునే యాడ్ రూపొందించిన జ్యుయలరీ బ్రాండ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

Jewelry ad goes viral: మనసును హత్తుకునే యాడ్ రూపొందించిన జ్యుయలరీ బ్రాండ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

ఆకట్టుకుంటున్న భీమా జ్వూయలర్స్ యాడ్ (Photo/Youtube)

వాణిజ్య ప్రకటనలు చూడగానే విసుగు రావడం.. వెంటనే టీవీ ఛానల్ మార్చడం లేదా యూట్యూబ్ లో అయితే స్కిప్ కొట్టడం తరచూ చేస్తుంటాం. అయితే...

  • Share this:


వాణిజ్య ప్రకటనలు చూడగానే విసుగు రావడం.. వెంటనే టీవీ ఛానల్ మార్చడం లేదా యూట్యూబ్ లో అయితే స్కిప్ కొట్టడం తరచూ చేస్తుంటాం. అయితే కొన్ని ప్రకటనలు ఆకట్టుకోవడమే కాదు ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. తాజాగా కేరళకు చెందిన ఓ నగల సంస్థకు చెందిన ఓ వాణిజ్య ప్రకటన ఈ కోవకే వస్తుంది. చూసిన ప్రతి ఒక్కరూ ఈ ప్రకటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే కేరళలోని కొచ్చికి చెందిన భీమా జ్యూయలరీస్ సంస్థ తమ నగల గురించి యూట్యూబ్ క్యాంపైన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విడుదల చేసిన వీడియోలో ఓ ట్రాన్స్ పర్సన్ చుట్టూ తిరిగే ఈ చిన్న స్టోరీ ఆకట్టుకుంటోంది. 'ప్యూర్ యాజ్ లవ్'(ప్రేమ అంత స్వచ్ఛమైంది) అనే థీమ్ తో రూపొందించారు. ఇందులో ఓ ట్రాన్స్ పర్సన్ తో పాటు సామాజిక కార్యకర్త మీరా సింఘానియా ఉన్నారు. వాణిజ్య ప్రకటన వీడియోలోకి వెళ్తే.. సంతోషంగా, ఆత్మవిశ్వసంతో యువతిగా మారిన ఓ బాలుడు ప్రయాణాన్ని ఇందులో వివరించారు. కుటుబంలోని ప్రతి ఒక్కరి నుంచి అపారమైన ప్రేమ, మద్దతు లభిస్తూ.. జీవితంలోని ప్రతి దశలో కథానాయకుడు తల్లిదండ్రులతో పాటు తాతా, బామ్మల నుంచి బంగారు ఆభరణాలను బహుమతిగా అందుకుంటారు.

ఆనందంతో పరవశించి పోయే ఆ బాలుడు మహిళగా రూపాంతరం చెందుతాడు. ఆ తర్వాత ఆమె ప్రతి నగను ఎంతో అందంగా అలంకరించుకొని కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకుంటుంది. క్లైమాక్స్ లో సంప్రదాయ దుస్తుల్లో బంగారు ఆభరణాల్లో వధువుగా అలంకరించుకొని పెళ్లి పీటలెక్కుతుంది. దీంతో వీడియో పూర్తవుతుంది. ఆన్ లైన్ లో విడుదల అయిన ఈ వీడియో రెండు రోజుల్లోనే 90 వేల వ్యూస్ అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వాణిజ్య ప్రకటన వీడియోపై నెటిజన్లు సామాజిక మాధ్యమంలో విశేషంగా స్పందిస్తున్నారు. ఈ అద్భుతమైన ఐడియాతో ప్రకటన విడుదల చేసినందుకు గానూ వారు ఈ జ్యూయలరీ బ్రాండ్ ను ప్రశంసిస్తున్నారు.






"ఈ వీడియో నిజంగా అద్భుతంగా ఉంది. పోస్ట్ చేసినందుకు భీమాకు ధన్యవాదాలు" అని ఒకరు పోస్ట్ చేయగా.. "వాణిజ్య ప్రకటన చూసిన తర్వాత మాటలు రావడం లేదు" అని మరొకరు స్పందించారు. "ట్రాన్స్ ఉమన్ గా తను ఎంతో భావోద్వేగానికి గురయ్యాను" అని మరో యూజర్ కామెంట్ చేశారు. ప్యూర్ యాజ్ లవ్ (ప్రేమ లాగే పవిత్రంగా ఉంది) అంటూ ఇంకొకరు పోస్ట్ చేశారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు కూడా ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీర్ దాస్, శృతి సేథ్ లాంటి సెలబ్రెటీలు ఈ ప్రకటనను పొగుడుతూ కామెంట్ పోస్ట్ చేశారు.

Published by:Purna Chandra
First published:

అగ్ర కథనాలు