హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Humanity: వెల్లివిరిసిన మానవత్వం... ఐదు గంటల్లో 91 లక్షలు.. ఎక్కడో తెలుసా..?

Humanity: వెల్లివిరిసిన మానవత్వం... ఐదు గంటల్లో 91 లక్షలు.. ఎక్కడో తెలుసా..?

సాహాయం చేయాలని కోరుతున్న కుటుంబ సభ్యులు

సాహాయం చేయాలని కోరుతున్న కుటుంబ సభ్యులు

Kerala: ఆరేళ్ల బాలుడికి క్యాన్సర్ వచ్చిందని వైద్యులు తెలిపారు. వెంటనే బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలని సూచించారు. పాపం.. ఆ పిల్లాడి తల్లిదండ్రులు చిన్న దుకాణాన్ని నడిపిస్తు తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ూAthirampuzha residents raise Rs 91 lakhs in 5 hrs: కేరళలోని కొట్టాయంలో అరుదైన సంఘటన జరిగింది. ఆపదలో ఉన్న తమ గ్రామస్థుడిని సహాయం చేసి వారి మంచి మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టం వచ్చినప్పుడు ఒకరికి మరోకరు అండగా నిలవాలనే.. మంచి సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన వార్తలలో నిలిచింది. కోట్టాయం కు చెందిన ఆరేళ్ల బాలుడికి క్యాన్సర్ సోకిందని వైద్యులు తెలిపారు. అయితే, వారి తల్లిదండ్రులు కేవలం దుకాణం నడిపి తమకుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వెంటనే అతనికి బోన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేయాలని సూచించారు. దీని కోసం సదరు కుటుంబం ఏంచేయాలో అర్థం కాలేని పరిస్థితిలో చేరుకున్నారు.

దీని కోసం దాదాపు. .30 లక్షల వరకు ఖర్చు కావచ్చని డాక్టర్లు తెలిపారు. వీరి కుటుంబం అంత డబ్బుని చెల్లించుకునే స్థితిలో లేదు. దీనితో ఏడునెలలుగా ఆస్పత్రిలో ఆపరేషన్ లేకుండా తాత్కలికంగా చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఈ విషయంమీద సదరు గ్రామస్థులు చలించిపోయారు. జెరోమ్ కె జస్టిన్ బాలుడి కోసం డబ్బులు జమచేయాలని భావించారు. ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయం చేయాలని కనీసం 500 రూపాయలు ఇవ్వాలని గ్రామంలో దండోరా వేయించారు. వారు .. 30 లక్షల రూపాయలను జమచేయాలని భావించారు.

అయితే, దీనికి కొట్టాయం అతిరంపూజ పంచాయతీ ప్రజల నుంచి విపరీతంగా స్పందన వచ్చింది. అదే విధంగా కొందరు యువకులు కమిటీగా ఏర్పడి డబ్బును కలెక్ట్ చేశారు. కేవలం ఐదుగంటల వ్యవధిలోనే 91 లక్షలు జమయ్యాయి. బాలుడికి వైద్యం కోసం కావాల్సిన సొమ్మును ఇచ్చి.. మిగతా డబ్బులను అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికోసం ఖర్చు చేయాలని పంచాయతీ పెద్దలు నిర్ణయించారు. ప్రస్తుతం ఆపద సమయంలో మేమున్నామంటూ.. గ్రామస్థులంతా కలసి ఒక్కతాటిపైకి రావడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. కాగా, కోజికోడ్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఇప్పటికే బాలుడికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ ప్రారంభమైందని గ్రామస్థులు తెలిపారు.

First published:

Tags: Cancer, Helping, Kerala, Villagers

ఉత్తమ కథలు