PAN-Aadhaar: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సేఫేనా? ఇలా దాచుకోండి

PAN-Aadhaar: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సేఫేనా? ఇలా దాచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

PAN-Aadhaar | మీ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లాంటి డాక్యుమెంట్స్ ఎప్పుడూ వెంట తీసుకెళ్లడం సాధ్యం కాదు. వాటిని ఆన్‌లైన్‌లో భద్రంగా దాచుకోండి ఇలా.

  • Share this:
    ఆధార్ కార్డ్... ఈ రోజుల్లో ప్రతీ చోట అవసరమైన డాక్యుమెంట్ ఇది. ఇక పాన్ కార్డ్ అయితే దాదాపు అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు అవసరం. ఇవే కాదు... పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్ అన్నీ ముఖ్యమైనవే. మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ సేఫ్‌గానే ఉన్నాయా? ఇంట్లో భద్రంగా ఉన్నాయనుకుంటున్నారా? ఇంట్లో దాచుకుంటే మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ డాక్యుమెంట్స్ అందుబాటులో ఉండవు. మరి ఆన్‌లైన్‌లో ఇలాంటి కీలకమైన, ముఖ్యమైన డాక్యుమెంట్స్ దాచుకోవడం ఎంతవరకు సేఫ్? ఈ అనుమానం చాలామందికి ఉండేదే. అందుకే కేంద్ర ప్రభుత్వం 2015 లో వర్చువల్ లాకర్‌ను ప్రారంభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా డిజీలాకర్ ప్లాట్‌ఫామ్ రూపొందించింది. ఇందులో మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ భద్రంగా దాచుకోవచ్చు. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌తో పాటు మీ సర్టిఫికెట్లను కూడా ఇందులో దాచుకోవచ్చు.

    SBI: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? ఈ విషయం తెలుసా?

    PAN Card: పాన్ కార్డులో తప్పులున్నాయా? ఈ యాప్‌లో అప్లై చేయండి ఇలా

    digilocker sign in password, digilocker create new account, digilocker app, digilocker username, how to link digilocker with aadhar, PAN Card, Aadhaar Card, డిజీలాకర్, డిజీలాకర్ యాప్, డిజిటల్ లాకర్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్

    మీ డాక్యుమెంట్స్ దాచుకోవాలంటే ముందుగా డిజీలాకర్‌లో మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. https://digilocker.gov.in/ వెబ్‌సైట్ లేదా డిజీలాకర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకొని డాక్యుమెంట్స్ దాచుకోవచ్చు. జేపీఈజీ, పీడీఎఫ్, పీఎన్‌జీ లాంటి ఫార్మాట్‌లో మీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులు మాత్రమే కాదు... ప్రభుత్వం జారీ చేసే ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా డీజీలాకర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజీలాకర్ యాప్ ఉంటే అందులో డాక్యుమెంట్స్ అన్నీ సులువుగా యాక్సెస్ చేయొచ్చు. రైలులో ప్రయాణించేప్పుడు లేదా ఆర్‌టీఏ అధికారులు మీ వాహనాలను తనిఖీ చేసినప్పుడు మీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఫిజికల్‌గా కాకుండా డిజీలాకర్‌లో చూపించొచ్చు.

    SBI Loan: 59 నిమిషాల్లో ఎస్‌బీఐ పర్సనల్, బిజినెస్, హోమ్ లోన్... అప్లై చేయండిలా

    Income Tax: రూ.1 లక్ష కన్నా ఎక్కువ నగలు కొంటున్నారా? ఐటీ నిఘా తప్పదు

    మీరు మీ మెయిల్‌లో లేదా ఇంకా ఎక్కడైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ దాచుకోవడం సేఫ్ కాదు. అందుకే ప్రభుత్వం రూపొందించిన డిజీలాకర్ ప్లాట్‌ఫామ్‌లో సేఫ్‌గా దాచుకోవడం మంచిది.
    Published by:Santhosh Kumar S
    First published: