• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • KBC SEASON 12 GETS ITS THIRD CROREPATI AFTER SCHOOL TEACHER FROM CHHATTISGARH ANSWERS THIS QUESTION NS GH

KBCలో దుమ్ము రేపిన టీచరమ్మ.. ఆ కోటి రూపాయల ప్రశ్న ఇదే..

KBCలో దుమ్ము రేపిన టీచరమ్మ.. ఆ కోటి రూపాయల ప్రశ్న ఇదే..

రూ. కోటి గెలిచిన టీచరమ్మ

కేబీసీ సీజన్ 12 దుమ్మురేపుతోంది. రియాల్టీ క్విజ్ షో (quiz show) అయిన 'కౌన్ బనేగా క్రోర్ పతి'లో బుధవారం ఏకంగా 3వ కోటీశ్వరురాలిగా ఛత్తీస్ గఢ్ కు చెందిన టీచరమ్మ రికార్డు సృష్టించారు.

  • Share this:
కేబీసీ సీజన్ 12 దుమ్మురేపుతోంది. రియాల్టీ క్విజ్ షో (quiz show) అయిన 'కౌన్ బనేగా క్రోర్ పతి'లో బుధవారం ఏకంగా 3వ కోటీశ్వరురాలిగా ఛత్తీస్ గఢ్ కు చెందిన టీచరమ్మ రికార్డు సృష్టించారు. 42 ఏళ్ల అనూపా (Anupa) దాస్ ఛత్తీస్ గఢ్ (Chattisgarh) లోని బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) హోస్ట్ చేసే ఈ షోలో 12వ సీజన్ ప్రస్తుతం టీవీలో ప్రసారమవుతుండగా ఈ సీజన్ లో ఇప్పటికే ఇద్దరు కోటీశ్వరులుగా విజయం సాధించారు.

కోటి రూపాయల ప్రశ్న ఇదే
ఒక కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం కరెక్టుగా చెప్పిన అనూపా దాస్ అందరి అభిమానాన్ని చూరగొన్నారు. 1962 నవంబర్ 18న లడఖ్ లో చూపిన ధైర్య సాహసాలకు పరం వీర్ చక్రా అవార్డు పొందినవారెవ్వరు అన్న ప్రశ్నకు మేజర్ షైతాన్ సింగ్ అంటూ సరైన సమాధానం చెప్పి కోటి రూపాయలు సాధించారు.

7 కోట్ల వద్ద క్విట్
7 కోట్ల రూపాయల ప్రశ్న వద్ద అనూపా క్విట్ కొట్టాల్సి వచ్చింది. సరైన సమాధానం తెలియని ఈమెకు లైఫ్ లైన్ ఆప్షన్స్ కూడా అయిపోవడంతో క్విట్ అయ్యారు. దీంతో కోటి రూపాయల ప్రైజ్ మనీతో ఇంటికి వెళ్లారు. వండే ఇంటర్నేనషన్ క్రికెట్ లో రియాజ్ పొన్నావాలా, షౌకత్ దుకాన్ వాలాలు ఏ టీం తరపున ఆడారు? ఈ ప్రశ్నకు కెన్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, ఇరాన్ అనే ఆప్షన్స్ లో ఆన్సర్ చెప్పలేక అనూపా క్విట్ కొట్టారు. ఆమె క్విట్ అయ్యాక ఆన్సర్ జస్ట్ గెస్ చేయమన్న బిగ్ బీతో ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటూ సమాధానం చెప్పగా, ఇదే రైట్ ఆన్సర్ అని బిగ్ బీ చెప్పారు. ఈ ప్రోగ్రాం హైలైట్స్ ను ప్రోమోగా కట్ చేసి, ట్విట్టర్లో అనూపాకు శుభాకాంక్షలు చెబుతూ సోనీ టీవీ (Sony) వీడియోను సైతం పోస్ట్ చేసింది.



నజియా, మోహితా, అనూపా
ఈ షోలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్న తొలి సివిల్ సర్వెంట్ గా IPS officer అయిన మోహితా శర్మ నిలిచారు. ఇక ఈ సీజన్ లో ఇప్పటికే నజియా నాసిమ్ కోటి రూపాయలు సొంతం చేసుకున్న ఛాంపియన్ గా నిలువగా, 2వ విజేతగా మోహితా, 3వ విజేతగా అనూపా నిలవడం విశేషం. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ లో ఉన్నత విద్య పూర్తి చేసిన నజియా ప్రస్తుతం రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థలో ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ లో గ్రూప్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తానికి కేబీసీ 12వ సీజన్ లో మహిళలు విజేతలుగా, కోటీశ్వరులుగా నిలుస్తుండటం హైలైట్ గా మారింది.
Published by:Nikhil Kumar S
First published: