• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • KAUN BANEGA CROREPATI 12 ELECTRICIAN EARNING RS 700 PER DAY WINS RS 25 LAKH DETAILS HERE MS GH

Kaun Banega Crorepati 12: కెబిసిలో రూ.25 లక్షలు గెలుచుకున్న ఎలక్ట్రీషియన్.. తన కుటుంబ నేపథ్యం తెలుసా?

Kaun Banega Crorepati 12: కెబిసిలో రూ.25 లక్షలు గెలుచుకున్న ఎలక్ట్రీషియన్.. తన కుటుంబ నేపథ్యం తెలుసా?

కెబిసిలో బిగ్ బి తో అనూజ్

Kaun Banega Crorepati 12: సోనీ టెలివిజన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది సామన్యుల జీవితాల్లో వెలుగులు నింపింది. కాగా, ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 12లో ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ సీజన్లో సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారు సైతం తమ ప్రతిభతో లక్షలు గెలుచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

  • News18
  • Last Updated:
  • Share this:
బాలీవుడ్ అగ్ర నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (Kaun Banega Crorepati) సీజన్ 12 మంచి సక్సెస్తో దూసుకుపోతోంది. సోనీ టెలివిజన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది సామన్యుల జీవితాల్లో వెలుగులు నింపింది. కాగా, ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 12లో ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ సీజన్లో సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారు సైతం తమ ప్రతిభతో లక్షలు గెలుచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం, కొనసాగుతోన్న కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 12లో సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అఫ్సీన్ నాజ్(Afseen Naaz) అనే యువతి రూ .25 లక్షలు గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, అలాంటి సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే వచ్చిన మరో కంటెస్టెంట్ అనుజ్ కుమార్ కూడా ఈ గేమ్ షోలో రూ .25 లక్షలు గెలుచుకున్నట్లు కేబీసీ తాజాగా విడుదల చేసిన ప్రోమో(Promo) ద్వారా తెలుస్తోంది.

ఇదే నిజమైతే అనుజ్ కుమార్(Anuj Kumar) రాబోయే ఎపిసోడ్ లో రూ.50 లక్షల గేమ్ షోలో పార్టిసిపేట్ చేయనున్నాడు. కాగా, ఎలక్ట్రీషియన్‌ గా పనిచేస్తున్న అనుజ్ కుమార్ రోజువారి సంపాదన రూ. 776 మాత్రమే. అటువంటి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అనుజ్ కుమార్.. కౌన్ బనేగా క్రోర్పతిలో ఈ స్థాయి వరకు రావడానికి చేసిన కృషి పట్ల అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. రూ.25 లక్షలు గెలుచుకున్న ఆయన మాట్లాడుతూ.. తన తల్లి తన కోసం జీవితాంతం కష్టపడి పనిచేసిందని, అయినప్పటికీ, ఆమెకు మెరుగైన జీవితాన్ని ఇవ్వలేకపోయానని, తన తల్లి జీవితంలో రూ .2 లక్షలకు మించి ఎప్పుడూ చూడలేదని భావోద్వేగానికి లోనయ్యాడు.

రూ.50 లక్షల గేమ్ షో లో పార్టిసిపేట్ చేయనున్న అనుజ్ కుమార్..

ఇదిలా ఉంటే, నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ప్రొఫెసర్(Professor) అఫ్సీన్ రూ .25 లక్షలు గెలుచుకుంది. తన తండ్రి ఇంతకుముందు సైకిల్ రిపేర్(Cycle Repairman) చేసేవాడని, ప్రస్తుతం ఆయన కెమిస్ట్ స్టోర్ (Chemist Store)లో పనిచేస్తున్నానని పేర్కొంది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యం కారణంగా, వైద్య విద్య(Medical Education)ను అభ్యసించలేకపోయానని ఆమె తెలిపింది. వైద్య విద్యను చదవడానికి అవసరమయ్యే డబ్బు చెల్లించే స్థోమత తన కుటుంబానికి లేకపోవడంతో డాక్టర్ కావాలనే కలను విరమించుకున్నానని పేర్కొంది. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రతి సంవత్సరం ఈద్ సందర్భంలోనే తాము కొత్త బట్టలు కొంటాం.. దీని వల్ల ఇరుగుపొరుగు వారి నుంచి, బంధువుల నుంచి చాలా సార్లు వెక్కింపులు కూడా ఎదుర్కొన్నామని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అఫ్రీన్ నాజ్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు విన్న బిగ్ బీ (Big B).. ఆమె రూ.25 లక్షలు గెలుచుకోవడం పట్ల అభినందనలు తెలిపాడు.
Published by:Srinivas Munigala
First published:

అగ్ర కథనాలు