హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Katrina Viral Video : అరబిక్ కుతు పాటకి స్కూల్ పిల్లలతో కలిసి కత్రినా డ్యాన్స్..వీడియో వైరల్

Katrina Viral Video : అరబిక్ కుతు పాటకి స్కూల్ పిల్లలతో కలిసి కత్రినా డ్యాన్స్..వీడియో వైరల్

కత్రినా కైఫ్(ఫైల్ ఫొటో)

కత్రినా కైఫ్(ఫైల్ ఫొటో)

Katrina Kaif dance video : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్(Katrina Kaif) డ్యాన్స్ (Dance)వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Katrina Kaif dance video : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్(Katrina Kaif) డ్యాన్స్ (Dance)వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది. తమిళనాడు(Tamilnadu)లోని మదురైలోని మౌంటెన్ వ్యూ స్కూల్‌లో చిన్నపిల్లలతో కలిసి..ఇటీవల సూపర్ హిట్ అయిన ‘అరబిక్ కుతు’ పాటకు కత్రినా కైఫ్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ట్విట్టర్ లో ఆదివారం కత్రినా కైఫ్ అభిమాని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్,వేలల్లో లైక్ లు వస్తున్నాయి. హార్ట్, లవ్‌స్ట్రక్ ఎమోజీలతో ఈ వీడియో సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో కత్రినా చాలా అందంగా ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఇది ఒక వైబ్ అని మరొకరు కామెంట్ చేశారు. కత్రినా డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ చూడదగినది అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. కాగా,మరో వైరల్ వీడియోలో కత్రినా కైఫ్ పాఠశాల సిబ్బందితో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది.

నిరుపేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి తమిళనాడులోని మౌంటెన్ వ్యూ స్కూల్ 2015లో రిలీఫ్ ప్రాజెక్ట్ ఇండియాలో భాగంగా ప్రారంభించబడింది. కత్రినా కైఫ్ తల్లి సుజానే చాలా కాలంగా పాఠశాలతో అనుబంధం కలిగి ఉంది, అక్కడ బోధిస్తోంది కూడా. 2020లో, పాఠశాలలో తరగతి గదులను నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలని కత్రినా కైఫ్ ప్రజలను కోరారు.

ఆడు మగాడ్రా బుజ్జీ : చీతాతోనే సెల్ఫీ తీసుకున్నాడు..వైరల్ వీడియో

"ఎక్కువ మంది పిల్లలు వారి కలలను నెరవేర్చడానికి మన వంతు కృషి చేద్దాం. మనం ఉన్న కష్ట సమయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఒకరికొకరు ఉండటం మరింత ముఖ్యం"అని కత్రినా కైఫ్ ఆ సమయంలో తెలిపారు. కత్రినా కైఫ్ ఈ చొరవ ద్వారా... వివక్ష లేకుండా నాణ్యమైన విద్య కోసం కృషి చేయాలని, ఆడ శిశు హత్యలు, భ్రూణహత్యలు మరియు బాలికా విద్య వంటి అంశాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bollywood actor, Bollywood beauty, Katrina Kaif, Tamilnadu, Viral Video

ఉత్తమ కథలు