Home /News /trending /

KASHMIRI YOUTH SIAM HAIDER POPULAR AS RUBBER BOY VIDEOS VIRAL SNR

OMG: వామ్మో ఆ కాశ్మీర్‌ కుర్రాడి టాలెంట్ ఎక్స్‌లెంట్ .. అతడిది శరీరమా లేక స్ప్రింగా

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

OMG: అతనో 23సంవత్సరాల స్ప్రింగ్. శరీరాన్ని ఎటు పడితే అటు రబ్బరులా సాగతీయగల సమర్ధుడు. ఒంట్లో ఏమాత్రం ఎముకలు లేనట్లుగా ప్రతి అవయవాన్ని మెలి తిప్పగల సాహసి. ఒక్కమాటలో చెప్పాలంటే అతడిని సొంత పేరుతో కంటే రబ్బర్‌ బాయ్‌గా బాగా పాపులర్ అయ్యాడు. ఇంతకీ అతను ఎక్కడున్నాడు..ఏం చేస్తున్నాడు..అతని గోల్ ఏంటో తెలియాలంటే అతని స్టోరీ తెలియాల్సిందే.

ఇంకా చదవండి ...
అతనో 23సంవత్సరాల స్ప్రింగ్. శరీరాన్ని ఎటు పడితే అటు రబ్బరులా సాగతీయగల సమర్ధుడు. ఒంట్లో ఏమాత్రం ఎముకలు లేనట్లుగా ప్రతి అవయవాన్ని మెలి తిప్పగల సాహసి. ఒక్కమాటలో చెప్పాలంటే అతడిని సొంత పేరుతో కంటే రబ్బర్‌ బాయ్‌గా బాగా పాపులర్ అయ్యాడు. ఇంతకీ అతను ఎక్కడున్నాడు..ఏం చేస్తున్నాడు..అతని గోల్ ఏంటో తెలియాలంటే అతని స్టోరీ తెలియాల్సిందే. నార్త్‌ కశ్మీర్‌(North Kashmir)లోని బందిపొరా(Bandipora)లోని షాదిపోరా (Shadipora)జిల్లాకు చెందిన సియామ్‌ హైదర్‌(Siyam Hyder), అనే కుర్రాడు శరీరాన్ని తాడులా మెలిపెట్టేస్తాడు. రబ్బరులా సాగదీస్తాడు. స్ప్రింగ్‌లా ఎటు పడితే అటు వంచేస్తాడు. ఇది కేవలం అతనికి మాత్రమే సాధ్యమైన విద్య. మన దేశంలో ఇంటతి హైలీ టాలెంట్‌ మరొకరికి లేదని చెప్పాల్సిందే. ఎందుకంటే తన శరీరంలోని పొట్ట, నడుము, తొంటితో పాటు తలను కూడా 180 డిగ్రీల వరకు తిప్పగలడు. కాళ్లు, చేతులను అయితే 360డిగ్రీల వంచి చూపిస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అతడ్ని హైదర్‌ అని పిలిచే వాళ్లు తక్కువ మంది ఉంటారు. రబ్బర్‌బాయ్‌ (Rubber boy)గానే ప్రసిద్ధి చెందాడు.

వామ్మో ఇదేం విద్య నాయనా..
శరీరంలోని ప్రతి అవయవం విలువైనదే. అత్యంత ముఖ్యమైనవి కూడా. ఏ ఒక్కటి విరిగినా, దెబ్బతిన్న జీవితాంతం జీవచ్చవంలా అవిటి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటివన్ని తెలిసి కూడా హైదర్‌ బాడీని ఫ్లెక్సిబిలిటీ కోసం మొదట్లో డ్యాన్స్, జెమ్నాస్టిక్స్ చేయడం అలవాటు చేసుకున్నాడు. అందులో భాగంగానే తన శరీరాన్ని ఇంకా ఎంత వరకు బెండ్ చేయవచ్చు..చేతులు, కాళ్లను ఎలా రివర్స్‌లో తిప్పవచ్చని ట్రై చేస్తూ వచ్చాడు. ఇది ఇప్పటి ప్రయత్నం కాదు..హైదర్ 2010సంవత్సరం నుంచి చేస్తూ వచ్చాడు.

వాటే గ్రేట్ టాలెంట్..
కశ్మీర్‌ రబ్బర్‌బాయ్ టాలెంట్‌ చూసి జమ్మూలో డ్యాన్స్‌ టీచర్‌గా ఎంపికయ్యాడు. వృత్తి డ్యాన్స్ టీచర్ అయినప్పటికి యోగా కూడా నేర్పిస్తూ ఎంతో పేరు ప్రతిష్టలు సంపాధించాడు. ఒకటి రెండు కాదు ఈ రబ్బర్‌ బాయ్ ఎక్స్‌ట్రా టాలెంట్‌కి పదుల సంఖ్యలో నేషనల్‌ ప్రైజ్‌లు, అవార్డులు అందుకున్నాడు. బాడీ ఫ్లెక్సిబిలీటీ ప్రాక్టీస్‌లో భాగంగా చేయి విరిగిపోయింది. పట్టుమని పాతికేళ్లు కూడా లేని వయసులో చేయి విరగడంతో హైదర్ తల్లి కంగారుపడి వద్దని చెప్పినప్పటికి హైదర్‌ వెనకడుగు వేయలేదు. తాను చేస్తున్న ఫీట్స్‌ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. తన గోల్‌ ఒక్కటే అంతర్జాతీయ స్థాయిలో జరిగే టాలెంట్‌ షోలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆరాటపడుతున్నాడు..
Published by:Siva Nanduri
First published:

Tags: Jammu and Kashmir, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు